పదవ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబల్ ఉద్యోగం సంపాదించవచ్చు. కేవలం పదోతరగతి విద్యార్హతతో ప్రతిఏటా భారీ ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ నియామకాలకు స్టాప్ సెలక్షన్ కమిషన్ రెడీ అవుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు ఉండే వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతిఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నవంబర్ 24వ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు డిసెంబర్ 28తో ముగుస్తుంది.
గతేడాది నవంబర్ లో ఈ నోటిఫికేషన్ ద్వారానే వివిధ సాయుధ బలగాల్లో 50, 187 కానిస్టేబుల్, సిపాయి పోస్టులను భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతిలో పాస్ అయితే చాలు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వెరిఫికేషన్ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుంది.