హైదరాబాద్‌లోని మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 210 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీటెక్, బీఈ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 11 తో అప్లికేషన్లు ముగియనుండగా.. అర్హత కలిగిన అభ్యర్థులు అప్పటిలోగా ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య- 210
కంపెనీ పేరు: మిశ్రా ధాతు నిగమ్ (మిధాని)
పోస్ట్ పేరు: అప్రెంటిస్ ట్రైనీలు
విద్యార్హత:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌లు (TATలు): సంబంధిత విభాగంలో రాష్ట్ర కౌన్సిల్ లేదా సాంకేతిక విద్యా మండలి నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితిని పాటిస్తారు. ఐటీఐ ట్రేడ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.
జీతం/స్టైఫండ్ :
అప్రెంటిస్ ట్రైనీలకు నెలకు చెల్లించే స్టైఫండ్ వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (GAT) పోస్టులకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్ (TAT)పోస్టులకు రూ. 10,900 చెల్లిస్తారు. అంతే కాకుండా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు రూ. 9,600 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
ఐటీఐ ట్రేడ్‌లు పోస్టులు : SSC, ITI (NCVT)లో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ పోస్టులు: టెన్త్, గ్రాడ్యుయేషన్/డిప్లొమాలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అన్ని పోస్టులకు ఫైనల్ లిస్ట్ అనేది సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ వంటి తదితర అంశాల ఆధారంగా ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ: డిసెంబర్ 11 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు మిధాని వెబ్‌సైట్ midhani-india.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





