HomeLATESTనిమ్స్​లో హాస్పిటల్​ మేనేజ్​మెంట్ పీజీ​ కోర్సు

నిమ్స్​లో హాస్పిటల్​ మేనేజ్​మెంట్ పీజీ​ కోర్సు

బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీటెక్ .. ఇలా ఏ డిగ్రీ చదివిన వారికైనా ఈ కోర్సులో చేరే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ మేనేజ్‌ మెంట్ పీజీ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్​ 20వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. తర్వాత 6 నెలల పాటు నిమ్స్‌‌లోనే ఇంటర్న్ షిప్ ఉంటుంది. మొత్తం 20 సీట్లు. ఎంట్రన్స్‌‌‌‌ టెస్ట్ ద్వారా సెలెక్షన్స్ జరుగుతాయి. ఎన్నో ప్రైవేటు వర్శిటీలు, కాలేజీలు ఈ కోర్సును అందిస్తుండగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఈ కోర్సును ఆఫర్ చేస్తుండడం విశేషం. ఈ కోర్సు పూర్తి చేస్తే ​కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మా, ఇన్సూరె న్స్, రీసెర్చ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెం ట్, మెడికల్ టూరిజం సంస్థల్లో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేషన్, మెయింటనెన్స్, బిల్డింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛార్జ్ , హాస్పిటల్ కోఆర్డినేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్​ అందుబాటులో ఉన్నాయి.

సీట్లు : 20
కాలవ్యవధి: 2 సంవత్సరాలు + 6 నెలలపాటు నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ చేయాలి.
అర్హత: మెడికల్ /నాన్ మెడికల్ విభాగంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 20 నుం చి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది.)

Advertisement

అప్లై చేయండిలా.. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండిం టిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసేవారు హార్డ్ కాపీని నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌ లో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. 

ముఖ్యతేదీలు
ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తుకు చివరితేది: 2020 అక్లోబరు 20 ( అదే తేదీలోగా హార్డ్ కాపీలు చేరాల్సి ఉంటుంది)
దరఖాస్తు ఫీజు; రూ.1100
ఎంట్రన్స్ టెస్ట్ తేది: తరువాత ప్రకటిస్తారు
ఈమెయిల్; nimsmhm2020@gmail.com
అడ్రస్​; Associate Dear, Academic-2, Second Floor, Old OPD Block, NIMS, Punjagutta, Hyderabad-500082​
వివరాలకు ఫోన్​ నెంబర్లు;
వెబ్ సైట్ : www.nims.edu.in

సెలక్షన్ ప్రాసెస్‌ : ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 70  మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు వైవా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సౌకర్యం ఉంది. 

మొత్తం 100 మార్కులు
హెల్త్ రిలేటెడ్ 20
అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ 10
కంప్యూటర్ సైన్స్_10
జనరల్ నాలెడ్జ్ 10
ఐక్యూ 10
ఇంగ్లిష్ 10


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!