ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల నియమాకాలకు భరీగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ జాబ్ మేళాల (Job Mela) ద్వారా ప్రైవేటు సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. తాజాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసర్ రావు తన Dr GSR Charitable Trust ద్వారా భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనవరి 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జామ్ మేళాలో దాదాపు 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో పేటీఎం, అపోలో, హెటిరో తదితర ప్రముఖ సంస్థలు ఉన్నాయి.
ఈ సంస్థల్లో మొత్తం 7 వేలకు పైగా ఖాళీలకు ఈ జాబ్ మేళా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళా జనవరి 7న ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్-LINK
విద్యార్హతలు: ఎలాంటి విద్యార్హత లేని వారి నుంచి పీజీ చేసిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
జాబ్ మేళా నిర్వహించు చిరునామా: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కోర్టు దగ్గర, భద్రాద్రి కొత్తగూడెం.