ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇప్పటికే వరుసగా భారీ జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవెలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 5వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా 20కి పైగా కంపెనీల్లో దాదాపు 1500 ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ మేళాలో అమర రాజా, ఎయిర్టెల్, ఫ్లిప్ కార్ట్, మెడికవర్ హాస్పటల్స్ లాంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేయపట్టనున్నాయి.
విద్యార్హతల వివరాలు:
ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ తదితర అన్ని విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల కోసం ఉద్యోగాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ లో 1422 జాబ్స్.. దరఖాస్తుకు మరో 4 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
వేతనం: ఎంపికైన పోస్టు, కంపెనీ, విద్యార్హతల ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు. కనిష్ట వేతనం రూ.10 వేలకు కాగా.. అత్యధికంగా రూ.30 వేల వరకు వేతనం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా:
ప్రముఖ పాలిటెక్నిక్ కాలేజీ, నెల్లూరు రోడ్, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.
ఇంటర్వ్యూలు నిర్వహించే సమయం: నవంబర్ 5వ తేదీ ఉదయం 9 గంటలు.
Job Mali