నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ నుంచి పీజీ వరకు ఏ విద్యార్హత ఉన్నా.. ఉద్యోగం పొందే గొప్ప అవకాశం. దాదాపు 150 కంపెనీలు..5000 ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సారథ్యంలో సింగరేణి కాలరీస్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ సహకారంతో అక్టోబర్ 25న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

అర్హతలు
టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, బీటెక్, ఇతర ఏ ఉన్నత అర్హతలున్నా.. ఈ జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. వయసు 18–40 ఏళ్ల లోపు ఉండాలి.
జాబ్ మేళా అడ్రస్
పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ , సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనక హుజూర్ నగర్లో ఉదయం 08గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఫొటోలు, ఆధార్ కార్డు అన్ని సర్టిఫికేట్లు జిరాక్స్‌లు, ఒరిజినల్స్‌లో హాజరుకావాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు 9000937805, 9848997050, 9848409466 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.





