HomeJOBSడా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో.. మెగా జాబ్ మేళా

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో.. మెగా జాబ్ మేళా

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Dr. B.R. Ambedkar Open University – Dr. BRAOU), విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను అందించడానికి రిటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI) తో కలిసి జాబ్ మేళాను నిర్వహించనుంది. ‘చదువుకుంటూ సంపాదించండి’ (Earn While You Learn) అనే అప్రెంటిస్ షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

పూర్తి వివరాలు:
తేదీ: జూలై 31 వ తేదీన జాబ్ మేళా జరుగుతుంది.

వేదిక: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్, జూబ్లీహిల్స్, హైదరాబాద్

సమయం: ఉదయం 10:00 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుంది.

ఎవరు అర్హులు ?

  1. డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ(UG) మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, చివరి సంవత్సరం చదువుతున్న (అన్ని స్ట్రీమ్‌లకు చెందిన) వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
  2. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.
  3. డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

RASCI అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలు:

RASCI అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమం. విద్యార్థులను ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రముఖ కంపెనీలలో అప్రెంటిస్‌లుగా నియమిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ రూపొందించారు. విద్యార్థులకు సైద్ధాంతిక జ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలు రెండింటినీ అందించడం ద్వారా వారు వివిధ రకాల ఉద్యోగాల్లో పనిచేయడానికి అవకాశం కలుగుతుంది. అప్రెంటిస్ షిప్ విజయవంతంగా పూర్తయిన తర్వాత రిటైల్ రంగంలో ఉద్యోగాలను పొందవచ్చు.

ప్రోగ్రామ్ ప్రయోజనాలు:
ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

స్టైఫండ్: విద్యార్థులు నెలకు రూ. 7,000 నుంచి రూ. 24,000 వరకు స్టైఫండ్ సంపాదించవచ్చు. ఈ స్టైఫండ్ అప్రెంటిస్‌షిప్ పూర్తి కాలం.. అంటే మొదటి నెల నుంచి చెల్లిస్తారు.

ప్రముఖ కంపెనీలతో పని చేయడం:ఈ అప్రెంటిస్‌షిప్ పూర్తయిన తర్వాత రిలయన్స్ రిటైల్ (Reliance Retail), టాటా (Tata), షాపర్స్ స్టాప్ (Shoppers Stop), మోర్ రిటైల్ (More Retail) వంటి భారతదేశంలోని ప్రముఖ రిటైల్ బ్రాండ్‌లతో పని చేసే అవకాశం లభిస్తుంది.

కెరీర్ గైడెన్స్: ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత శాశ్వత ఉపాధిని పొందవచ్చు.

ఆర్థిక స్వాతంత్ర్యం: ఈ కార్యక్రమం విద్యార్థులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

జాబ్ మేళాకు హాజరయ్యేటప్పుడు తీసుకురావాల్సినవి:
మీ అప్‌డేటెడ్ రెజ్యూమ్ (Resume).
యూనివర్సిటీ గుర్తింపు కార్డు (University ID card).

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.

నిర్వహణ:
ఈ జాబ్ మేళాను డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, RASCI (రిటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సహకారంతో నిర్వహిస్తోంది.

RASCI ప్రోగ్రామ్‌ల గురించి మరిన్ని వివరాల కోసం వారి అధికారిక వెబ్‌సైట్లను లేదా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరింత సమాచారం కోసం:
హెల్ప్ డెస్క్: 040-23680333/555కాల్ సెంటర్: 18005990101

వెబ్‌సైట్‌లు: online.braou.ac.in, www.braou.ac.in లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here