ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకూ రిజిస్ర్టేషన్ కోసం గడువు ఇచ్చింది. www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని, వెబ్‌సైట్‌లో పేర్కొన్న సర్టిఫికెట్లన్నింటినీ అప్‌లోడ్ చేయాలని ప్రకటించింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది.
ఈ లిస్ట్ ఆధారంగానే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. నీట్‌లో క్వాలిఫై అయి ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు పొందాలనుకుంటున్న ప్రతి విద్యార్థి రిజిస్ర్టేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. రిజిస్ర్టేషన్ చేసుకోకపోతే కౌన్సిలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉండదు.
వెబ్ సైట్లో ర్యాంకుల జాబితా
తెలంగాణ నుంచి నీట్ రాసిన విద్యార్థుల మార్కులు, ర్యాంకులను యూనివర్సిటీ విడుదల చేసింది. రాష్ర్టం నుంచి 50,392 మంది నీట్ రాశారు. ఇందులో 28,093(55.75 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై కాని విద్యార్థుల మార్కుల వివరాలు కూడా హెల్త్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో స్టూడెంట్లకు అందుబాటులో ఉంచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇచ్చిన ర్యాంకులనే తాము రిలీజ్ చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది.