ప్రభుత్వ రంగ సంస్థ అయిన మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL).. పలు పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 667 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జూనియర్ ఓవర్‌మ్యాన్, మైనింగ్ సిర్దార్, సర్వేయర్ , టెక్నీషియన్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్లికేషన్లు నేటితో ముగియనున్నాయి. పోస్టులను భట్టి విద్యార్హతలను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 667 పోస్టులు
విభాగాల వారిగా..
మైనింగ్ సిర్దార్: 448 పోస్టులు
జూనియర్ ఓవర్‌మ్యాన్ : 192 పోస్టులు
సర్వేయర్ : 24 పోస్టులు
ట్రాన్స్‌లేటర్ : 01 పోస్ట్
టెక్నీషియన్ : 02 పోస్టులు
విద్యార్హతలు:
పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.
జూనియర్ ఓవర్‌మ్యాన్: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. అలాగే DGMS జారీ చేసిన ఓవర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్లు తప్పనిసరి.
మైనింగ్ సిర్దార్: ఇంటర్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి. మైనింగ్ సిర్దార్‌షిప్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
సర్వేయర్: ఇంటర్ లేదా మైనింగ్ సర్వేయింగ్‌లో డిప్లొమా/డిగ్రీతో పాటు సర్వే సర్టిఫికేట్ ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 06-04-2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు NCWA-XI నిబంధనల ప్రకారం నెలకు రూ. 41,966 నుంచి రూ. 51,103 వరకు జీతం లభిస్తుంది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉండదు.
సెక్షన్ A: జనరల్ అవేర్నెస్/ఆప్టిట్యూడ్ (20 మార్కులు)
సెక్షన్ B: టెక్నికల్ నాలెడ్జ్ (80 మార్కులు)
మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు. పరీక్షలో మెరిట్ సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ. 1180 (ఫీజు + GST). ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ , మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్లై చేయడం ఎలా?
1.మొదట MCL అధికారిక వెబ్ సైట్ mahanadicoal.in లోకి లాగిన్ అవ్వాలి.
2.’Careers’ విభాగంలో రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3.పేరు, మొబైల్ నంబర్ , ఈమెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోండి.
4.లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయండి.
- అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి.





