HomeLATESTనిట్​లో ఎంసీఏ చేయాలంటే.. NIMCET 2023 నోటిఫికేషన్​ వెలువడింది

నిట్​లో ఎంసీఏ చేయాలంటే.. NIMCET 2023 నోటిఫికేషన్​ వెలువడింది

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) సంస్థలు అందిన్తున్న మాస్టర్​ ఆఫ్​ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌(MCA) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నిట్‌ ఎంసీఏ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (NIMCET) 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది నిట్‌ జంషెడ్‌పూర్‌ దీనిని నిర్వహిస్తోంది. వరంగల్‌,
రాంప్‌పూర్‌, సూరత్​కల్​, తిరుచిరాపల్లి, కురుక్షేత్ర, అగర్తలా, జంషెడ్‌పూర్‌, భోపాల్‌, అలహాబాద్‌ ఎన్​ఐటీలు ఇందులో పార్టిసిపేట్‌ చేస్తున్నాయి. నిమ్‌ సెట్‌ 2023లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. వరంగల్‌. నిట్‌లో రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక ప్రోగ్రామ్ నుంచి నుంచి వైదొలిగే వీలుంది. వీరికి పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ అడ్వాన్స్‌డ్‌ డిప్లామా ఇన్‌ కంప్యూటర్‌
అప్లికేషన్స్‌ (PGADCA) సర్టిఫికెట్​ ప్రదానం చేస్తారు.

Advertisement

సీట్ల వివరాలు: మొత్తం 819 నీట్లు ఉన్నాయి. వరంగల్‌ నిట్‌లో 58, తిరుచిరాపల్లి నిట్‌లో 115, సూర
త్కల్‌ నిట్‌లో 58, రాయ్‌పూర్‌ నిట్‌లో 110, కురుక్షేత్ర నిట్‌లో 06, జంపెడ్‌పూర్‌ నిట్‌లో 115, భోపాల్‌
ఎంఏఎన్‌ఐటీలో 115, అలహాబాద్‌ ఎంఏఎన్‌ఐటీలో 116, అగర్తల నిట్‌లో 80 నీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ ఒక సభెక్ట్‌గా ప్రథమ శ్రేణి
మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులు, ఓపెన్‌ యూనివర్సిటీల
నుంచి దూరవిద్య విధానంలో బీఎస్సీ/ బీఎన్సీ ఆనర్స్‌/ బీసీఏ/ బీఐటీ పూర్తిచేసినవారు దరఖాస్తు
చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎన్సీ, ఎన్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులుంటే అర్హులవుతారు. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసేవారు కూడా అవ్లయ్‌ చేసుకోవచ్చు. వీరు సెప్టెంబరు 15 నాటికి డిగ్రీ సర్టిఫికెట్‌, మార్కుల మెమోలు నబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

నిమ్‌సెట్‌ 2023 పరీక్ష విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 120 మల్టిపుల్ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్‌ నుంచి 50, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌
రీజనింగ్‌ నుంచి 40, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ నుంచి 20, జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగు
తారు. మేథమెటిక్స్‌ ప్రశ్నలకు ఒక్కోదానికి 12 మార్కులు, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌
రీజనింగ్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలకు ఒక్కోదానికి 6 మార్కులు, జనరల్‌ ఇంగ్లీష్‌ ప్రశ్నలకు ఒక్కో
దానికి 4 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి నెగెటివ్​ మార్కులుంటాయి. ఒక తప్పుకు పావు మార్కు కోత విధిస్తారు. మొత్తం మార్కులు 1000. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్​ మీడియంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు.

Advertisement

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 5
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 10
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌
నిమ్‌సెట్‌ 2023 తేదీ: జూన్‌ 11
వెబ్‌సైట్‌: www.nimcet.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!