భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL).. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 200 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. బీటెక్, డిప్లొమా, బీకాం, బీసీఏతో పాటు సంబంధిత విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 16 నుంచి జనవరి 1వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు: 200
సంస్థ పేరు: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్
అధికారిక వెబ్‌సైట్: https://mazagondock.in
విద్యార్హతలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు (170 పోస్టులు): అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ (B.Tech) లేదా బీకాం , బీసీఏ, బీబీఏ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్‌లు (30 పోస్టులు): అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా తప్పనిసరిగా డిప్లొమా/డిగ్రీ కోర్సును 1 ఏప్రిల్ 2021 తర్వాత పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: (01-03-2026 నాటికి): అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కింది విధంగా జరుగుతుంది.
షార్ట్‌లిస్ట్: అభ్యర్థులను క్వాలిఫైయింగ్ పరీక్షలో (డిగ్రీ/డిప్లొమా) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపిక: క్వాలిఫికేషన్ మార్కులకు 80% , ఇంటర్వ్యూ మార్కులకు 20% వెయిటేజ్ ఇచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జనవరి 1,2026 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://mazagondock.in/ద్వారా అప్లై చేసుకోవచ్చు.





