HomeLATESTటాప్​ బిజినెస్​ స్కూళ్లలో ఎంబీఏ: మ్యాట్​ అప్లికేషన్లు స్టార్ట్

టాప్​ బిజినెస్​ స్కూళ్లలో ఎంబీఏ: మ్యాట్​ అప్లికేషన్లు స్టార్ట్


దేశంలో టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేయడానికి మ్యాట్​ మే సెషన్​ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ర్యాంకు సాధిస్తే ఇండియాతోపాటు ఇంటర్నేషనల్ బీ–స్కూల్స్‌లో ఎంబీఏ చేయొచ్చు. మ్యాట్‌లో వచ్చిన స్కోర్​ను బేస్​ చేసుకొని చాలా బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్లు కల్పిస్తున్నాయి. 600కు పైగా టాప్ బీ–స్కూల్స్‌లో ఎంబీఏ చేయొచ్చు. హెచ్‌ఆర్‌‌డీ మంత్రిత్వ శాఖ 2003లోనే మ్యాట్‌కు జాతీయ పరీక్షగా గుర్తింపునిచ్చింది. మెజార్టీ బీ–స్కూల్స్ వాటి ప్రవేశాలకు మ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న 600 బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం
అర్హత: బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ తదితర ఎనీ డిగ్రీ. ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నవారూ అర్హులే.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ద్వారా
చివరితేది: పేపర్ బేస్డ్ టెస్ట్ కు: మే 24, కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​కు: జూన్​ 7
పరీక్షతేది: పేపర్​ బేస్డ్​ టెస్ట్: మే 30, కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్:​ జూన్​ 13
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : పీబీటీ –మే 26, సీబీటీ – జూన్​ 10,
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: https://mat.aima.in/may21/

అర్హతలు
మ్యాట్ రాయాలనుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఇలా ఏ బ్రాంచులో డిగ్రీ పూర్తి చేసినా చాలు. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఈ సంవత్సరం డిగ్రీ ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నవారు అర్హులే. వయసుకు సంబంధించి నిబంధనలేమీ లేవు. వయసు ఆధారంగా ఎంబీఏ అడ్మిషన్లు కల్పించడానికి ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిరాకరించింది. మ్యాట్ స్కోర్‌‌కు ఒక సంవత్సరంపాటు వ్యాలిడిటీ ఉంటుంది.

మే సెషన్​
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) మ్యాట్‌ను ఏడాదికి నాలుగు సార్లు కండక్ట్​ చేస్తోంది. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌‌లలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం మే సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎగ్జామ్‌ను పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) రెండు రకాలుగా రాసుకోవచ్చు.

ఎగ్జామ్ ప్యాటర్న్
పరీక్ష మల్టీఫుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. మొత్తం 5 విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మార్కులకు ప్రశ్నలుంటాయి. పీబీటీ, సీబీటీ, ఐబీటీ ఏ విధానంలో పరీక్ష రాసినా రెండున్నర గంటలపాటు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్కు ఉంటుంది.

సెక్షన్ ప్రశ్నలు మార్క్స్​ టైం(ని)
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 40 40 30
మ్యాథమెటికల్ స్కిల్స్ 40 40 40
డేటా అనాలసిస్ & సఫిషియన్సీ 40 40 35
ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్ 40 40 30
ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ 40 40 15
మొత్తం 200 200 150

Advertisement

సిలబస్

లాంగ్వేజ్ కాంప్రహెన్షన్:
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సెక్షన్‌లో వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్‌ రెండు పార్టులుంటాయి. ఇందులో వెర్బల్ రీజనింగ్, ఇడియమ్స్, ఆంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జంబుల్డ్ పారాగ్రాఫ్స్, సెంటెన్స్ కరెక్షన్, ఫారెన్ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఇంగ్లిష్, సెంటెన్స్ కంప్లిషన్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్ తదితర టాపిక్‌లుంటాయి.

డేటా అనాలసిస్ & సఫిషియన్సీ:
అభ్యర్థి క్రిటికల్ థింకింగ్‌ను పరీక్షించేందుకు డేటా అనాలసిస్, సఫిషియన్సీ నుంచి ప్రశ్నలడుగుతారు. ఇందులో కాలమ్‌ గ్రాఫ్స్, లైన్ చార్ట్స్, గ్రాఫ్స్ రిప్రెజింటింగ్ ఏరియా, బార్ గ్రాఫ్స్, పై చార్ట్, వెన్ చిత్రాల నుంచి క్వశ్చన్‌లు ఉంటాయి.

ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్‌:
అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని, లాజికల్ థింకింగ్‌ను పరీక్షించేలాఈ సెక్షన్ ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్, విజువల్ రీజనింగ్, అసర్షన్ అండ్ రీజన్స్, స్టేట్‌మెంట్స్ అండ్ అసంప్షన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు.

మ్యాథమెటికల్ స్కిల్స్:
మ్యాథమెటికల్ స్కిల్స్‌లో జామెట్రీ, ట్రిగనోమెట్రీ, రేషియో & ప్రపోర్షన్, పర్సెంటేజస్, ఆల్జీబ్రా, ప్రాఫిట్& లాస్, యావరేజెస్, పార్ట్‌నర్‌‌షిప్, టైమ్–స్పీడ్–డిస్టెన్స్, వర్క్ & టైమ్, నంబర్ సిస్టమ్, జామెట్రిక్ ప్రొగ్రెషన్ టాపిక్‌ల నుంచి క్వశ్చన్‌లు వస్తాయి.

ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్:
అభ్యర్థి నాలెడ్జ్, వర్తమాన అంశాలపై ఉన్న పట్టును టెస్ట్​ చేసేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. ఇందులో కరెంట్ ఎఫైర్స్, బిజినెస్, వరల్డ్ రికార్డ్స్, బుక్స్ & ఆథర్స్, సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సోషల్ ఇష్యూస్, స్పోర్ట్స్, ఫైనాన్స్, ఆటోమోబైల్స్, ఎంటర్‌‌టైన్‌మెంట్, కార్పొరేట్ ఈవెంట్స్, అవార్డ్స్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!