ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎగ్జిమ్ బ్యాంకు) 50 మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బిజినెస్/ ఫారిన్ ట్రేడ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌లో స్పెషలైజేషన్‌తో పీజీ (ఎంబీఏ/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయసు ఆగస్టు 1, 2024 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
సెలెక్షన్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు రూ.100 చెల్లించాలి. రాతపరీక్ష అక్టోబర్ లో నిర్వహిస్తారు. వివరాలకు www.eximbankindia.in వెబ్సైట్లో సంప్రదించాలి.