HomeLATESTబిజినెస్ స్కూల్స్​ ఎంట్రన్స్​: MAT

బిజినెస్ స్కూల్స్​ ఎంట్రన్స్​: MAT

దేశంలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ(మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. మ్యాట్(మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) లో ర్యాంకు సాధిస్తే ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ బీ–స్కూల్స్‌లో ఎంబీఏ చేయడానికి అవకాశం ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఉన్న 600 బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం

అర్హత: బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏ బ్రాంచులో అయినా డిగ్రీ పూర్తయితే చాలు. ఈ ఏడాది ఫైనలియర్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ద్వారా

ఫీజు: పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ) – రూ.1650, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) – 1650, రిమోట్ ప్రోక్టోర్‌‌డ్ టెస్ట్ (ఐబీటీ)– 1650, పీబీటీ, సీబీటీ రెండింటికి – 2750

చివరితేది: పేపర్ బేస్డ్ టెస్ట్ రాసేవారు అప్లై చేసేందుకు 2020 జూన్ 7, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్లై చేసేందుకు 2020 జూన్ 15
పరీక్షతేది: పీబీటీ – 2020 జూన్ 14, సీబీటీ – 2020 జూన్ 21

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : పీబీటీ – 2020 జూన్ 9, సీబీటీ–2020 జూన్ 17
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: https://mat.aima.in/may20/

మ్యాట్‌లో వచ్చిన స్కోర్ 600కు పైగా టాప్ బీ–స్కూల్స్‌లో ఎంబీఏ చదవడానికి ఉపయోగపడుతుంది. హెచ్‌ఆర్‌‌డీ మంత్రిత్వ శాఖ 2003లోనే మ్యాట్‌కు జాతీయ పరీక్షగా గుర్తింపునిచ్చింది. 1988 నుంచి బీ–స్కూల్స్ లో ప్రవేశాలకు మ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

ఇంట్లో నుంచి ఎగ్జామ్
మ్యాట్‌ను ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌‌లలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ప్రస్తుతం మే సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఎగ్జామ్‌ను పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ) లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) రెండు రకాలుగా రాసుకోవచ్చు. కరోనా కారణంగా ఎగ్జామ్ సెంటర్‌‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి రాసేందుకు ఈసారి రిమోట్ ప్రొక్టోరెడ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్‌ విధానంలోను టెస్ట్ నిర్వహిస్తోంది.

ఎగ్జామ్ ప్యాటర్న్
పరీక్ష మల్టీఫుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. మొత్తం 5 విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మార్కులకు ప్రశ్నలుంటాయి. పీబీటీ, సీబీటీ, ఐబీటీ ఏ విధానంలో పరీక్ష రాసినా రెండున్నర గంటలపాటు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్కు ఉంటుంది. మొత్తం 5 సెక్షన్లు ఉన్నప్పటికీ నాలుగు సెక్షన్‌లకు వచ్చిన స్కోర్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సెక్షన్ స్కోర్‌‌ను మ్యాట్ స్కోర్‌‌లో కలపరు. దీనిని విడిగా చూపిస్తారు. మెరిట్ లేదా పర్సంటైల్ స్కోర్‌‌ను లెక్కించడానికి ఈ సెక్షన్‌ను పరిగణనలోకి తీసుకోదు.

Advertisement
ఎగ్జామ్​ మెథడ్​​

సెక్షన్                                                 ప్రశ్నలు         మార్కులు
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్                           40               40
మ్యాథమెటికల్ స్కిల్స్                            40               40
డేటా అనాలసిస్ & సఫిషియన్సీ             40               40
ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్           40               40
ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్      40               40
మొత్తం                                                   200              200

హైదరాబాద్ లో బిజినెస్​ కాలేజీలు;
హైదరాబాద్‌కు చెందిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కి),
అరోరా బిజినెస్ స్కూల్,
ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్,
గురునానక్ బిజినెస్ స్కూల్,
హైదరాబాద్ బిజినెస్ స్కూల్,
ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్
ఎక్సలెన్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్,
ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌‌ప్రైజెస్,
విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్
ఐటీఎం బిజినెస్ స్కూల్ (వరంగల్​).

క్యాట్ వర్సెస్ మ్యాట్
డిగ్రీ తర్వాత ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్), మ్యాట్ (మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) రెండింటి సిలబస్, ప్యాటర్న్ ఒకేలా ఉన్నప్పటికీ కొన్ని తేడాలున్నాయి. దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో చేరడానికి క్యాట్(కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఎంట్రన్స్ నిర్వహిస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. టైర్–1 బిజినెస్ స్కూల్స్‌తోపాటు, ఐఐఎంల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
మ్యాట్ ద్వారా మాత్రం ఇండియాలోని 600 టాప్ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశాలుంటాయి. టైర్–2 బిజినెస్ స్కూల్స్‌లో అడ్మిషన్లు కల్పిస్తారు. దీనిని సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహిస్తారు. క్యాట్‌తో పోల్చినప్పుడు మ్యాట్ ఎగ్జామ్ కాస్త సులువుగా ఉంటుంది.



Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!