HomeADMISSIONSఐఐటీ మద్రాస్‌లో మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌ బీఎస్‌ డిగ్రీ

ఐఐటీ మద్రాస్‌లో మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌ బీఎస్‌ డిగ్రీ

మే 30 వరకు దరఖాస్తులకు అవకాశం
జూన్‌ 12 నుంచి క్వాలిఫయర్‌ ప్రిపరేషన్‌
జులై 19న క్వాలిఫయర్‌ పరీక్ష

ఐఐటీ మద్రాస్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సైన్స్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ 2026 (Four-year Bachelor of Science (BS) Degree in Management and Data Science) అడ్మిషన్స్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఐఐటీ మద్రాస్‌ నుంచి అధికారిక డిగ్రీతో పాటు అలుమ్ని హోదా లభిస్తుంది. పూర్తి ఫ్లెక్సిబుల్‌ విధానంలో ఈ డిగ్రీని అందిస్తోంది.

ఈ ప్రోగ్రామ్‌కు వయోపరిమితి లేదు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. పదో తరగతిలో ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ చదివి ఉండాలి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఫైనల్‌ పరీక్షల తర్వాత చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కోర్సులో కంటెంట్‌, ట్యుటోరియల్స్‌, అసైన్‌మెంట్లు ఆన్‌లైన్‌లో అందిస్తారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయాల్లో, ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. క్విజ్‌లు, పరీక్షలు మాత్రం అకడమిక్‌ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యక్షంగా నిర్వహిస్తారు.

అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా ముందుగా క్వాలిఫయర్‌ పరీక్షకు దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటేషనల్‌ థింకింగ్‌, ఇంగ్లిష్‌ అంశాల్లో నాలుగు వారాల ఫౌండేషన్‌ కంటెంట్‌కు యాక్సెస్‌ ఇస్తారు. ఈ నాలుగు వారాల ప్రిపరేషన్‌లో వారానికోసారి తప్పనిసరి అసైన్‌మెంట్లు పూర్తి చేయాలి. చివరగా క్వాలిఫయర్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన విద్యార్థులు ప్రోగ్రామ్‌లో అధికారికంగా చేరతారు.

ఈ డిగ్రీని మూడు స్థాయిలుగా రూపొందించారు. ఫౌండేషన్‌, డిప్లొమా, బీఎస్‌ డిగ్రీ స్థాయిల్లో మొత్తం 142 క్రెడిట్లు ఉంటాయి. ఫౌండేషన్‌ స్థాయిలో 32 క్రెడిట్లు, డిప్లొమా స్థాయిలో 60 క్రెడిట్లు, బీఎస్‌ డిగ్రీ స్థాయిలో 50 క్రెడిట్లు పూర్తి చేయాలి.

విద్యార్థులకు మల్టిపుల్‌ ఎగ్జిట్‌ ఆప్షన్లు కూడా కల్పించారు. ఫౌండేషన్‌ స్థాయి పూర్తి చేసినవారికి ఫౌండేషన్‌ లెవల్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. డిప్లొమా స్థాయి పూర్తి చేసినవారికి డేటా అనలిటిక్స్‌ ఫర్‌ బిజినెస్‌లో డిప్లొమా అందుతుంది. మొత్తం కోర్సు పూర్తి చేసినవారికి పూర్తి బీఎస్‌ డిగ్రీ, ఐఐటీ మద్రాస్‌ అలుమ్ని హోదా లభిస్తుంది.

2026 క్వాలిఫయర్‌ పరీక్షకు దరఖాస్తులు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యాయి. మే 30తో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. జూన్‌ 12 నుంచి క్వాలిఫయర్‌ ప్రిపరేషన్‌ మొదలవుతుంది. జులై 19న క్వాలిఫయర్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://study.iitm.ac.in/mg/ ద్వారా వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here