HomeLATESTస్పీడ్ పోస్టు లో టెన్త్ లాంగ్ మెమోలు.. స్కూల్​లో తీసుకోవాలి

స్పీడ్ పోస్టు లో టెన్త్ లాంగ్ మెమోలు.. స్కూల్​లో తీసుకోవాలి


టెన్త్ రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్లకు సంబంధించిన లాంగ్ మెమోలు రెడీ అయ్యాయి. మే నెలలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో పాసైన, ఆగస్టులో జరిగిన అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ లో పాసైన విద్యార్థుల మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఆయా స్కూల్స్​కు పంపించారు. అన్ని హైస్కూళ్లకు స్పీడ్ పోస్టు ద్వారా టెన్త్ లాంగ్​ మెమోలు పంపించామనీ, విద్యార్థులు వాటిని హెడ్మాస్టర్ల ద్వారా తీసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మొత్తం ఆన్వెల్ పరీక్షల్లో పాసైన 4,53,201 మంది, అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీలో పాసైన 38,477 మంది మెమోలను స్కూల్స్​కు పంపించారు.

Advertisement

స్కూళ్లకు చేరిన మెమోలను చూసుకోవాలనీ, ఎవరివైనా మిస్ అయితే తమకు తెలియజేయాలనీ కృష్ణారావు చెప్పారు. స్టూడెంట్లకు ఇచ్చేటప్పుడు రిజిస్ర్టర్ మెయిటెనెన్స్ చేయాలనీ, వారితో సంతకాలు తీసుకోవాలని హెడ్మాస్టర్లకు సూచించారు. అయితే పబ్లిక్ పరీక్షలు పూర్తయి 5 నెలలు దాటిన తర్వాత బడులకు లాంగ్​మెమోలు చేరుతుండటం గమనార్హం.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!