డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను నేర్చుకోవడానికి దాదాపు రూ.9వేలకు పైగా ఖర్చవుతుంది. ఇప్పుడు వీటిని డెస్క్‌టాప్‌లో గానీ మొబైల్లో గానీ ఉచితంగా నేర్చుకోవచ్చు.కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ టైమ్‌లో మీరు స్కిల్స్ పెంచుకునేందుకు కోర్సెరా సంస్థ 3800 కోర్సులను ఆన్లైన్లో ఉచితంగా అందిస్తోంది. దాదాపు 400 స్పెషలైజేషన్స్‌లో ఈ కోర్సులను ఆఫర్ చేసింది.
మీరు నేర్చుకోవాలనుకునే కోర్సు ఏ వర్సిటీ చెబుతుందో, ఏ యూనివర్సిటీ కోర్సులు చదవాలని ఉందో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అబ్రాడ్‌లో ఉన్న టాప్ వర్సిటీల్లో చదువుకోవాలనుకునే మీ గోల్ నిజం చేసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత అందించే సర్టిఫికెట్ మీ రెజ్యూమె వాల్యూను పెంచుతుంది.
లాంగ్వేజ్, టైమ్ పీరియడ్ మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. బిగినర్, ఇంటర్మీడియట్, మిక్స్డ్, అడ్వాన్స్డ్ అన్ని లెవల్స్ అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, అల్గారిథమ్, డేటా అనాలసిస్, కమ్యూనికేషన్, ఎకనామిక్స్, లీడర్షిప్ విభాగాల్లో కోర్సులున్నాయి.
ఇంగ్లీష్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ కోర్సును పెన్సిల్వేనియా వర్సిటీ ఆఫర్ చేస్తుండగా, ఇంట్రడక్షన్ టు ఫుడ్ అండ్ హెల్త్ కోర్సును స్టాన్ఫోర్డ్ వర్సిటీ అందిస్తోంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, మెడిసిన్, సొసైటీ ఇలా అనేక విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మెషీన్ లెర్నింగ్, ఐబీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, గూగుల్ ఐటీ ఆటోమేషన్ విత్ పైథాన్ వంటి టెక్నికల్ కోర్సులున్నాయి. సెప్టెంబర్ 30 వరకు రిజిస్టర్ చేసుకున్నవారు వీటిని ఉచితంగా నేర్చుకోవచ్చు.
వెంటనే రిజిస్టర్ చేసుకొండి. పూర్తి వివరాలకు www.coursera.org/courses?query=free
రూ.9 వేల కోర్సు.. లాక్ డౌన్ టైమ్‌లో ఫ్రీ. ఇలాంటివి 3800 స్కిల్ కోర్సులు
Advertisement