లాక్డౌన్ టైంలో ఏఐసీటీఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంట్లోనే ఉండి నేర్చుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్లకు ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు ఆఫర్ చేసింది. ఇంట్లో ఉండి చదువుకొండి.. చదవటం ఆపకండి… అంటూ ఈ ఫ్రీ కోర్సులు అనౌన్స్ చేసింది. బ్రాంచుల వారీగా మొత్తం 37 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఏఐసీటీఈతో పాటు చాలా కంపెనీలు ఈ కోర్సులు అందిస్తున్నాయి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రోటీన్, డిప్లొమా ఇన్ మెషీన్ లెర్నింగ్, ఫైథాన్, డేటా అనలటిక్స్, బిగ్ డేటా, ప్రోగ్రామింగ్ వర్క్ తదితర కోర్సులు ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి.
మెకానికల్ ఇంజినీరింగ్లో మెకానికల్ ఇంజినీరింగ్ ఎసెన్షియల్స్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్లో ఫైనాన్షియల్ అనాలసిస్, ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్లో ఆన్లైన్ ఇంటర్న్షిప్ కోర్సులున్నాయి.
హెల్త్ కేర్, కమ్యూనికేషన్ స్కిల్స్, రోబోటిక్స్, క్యాడ్లోను అనేక కోర్సులను ఉచితంగా చదువుకోవచ్చు.
మే 15 వరకు రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే వీటిని ఫ్రీగా నేర్చుకోవచ్చు.
వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొండి www.free.aicte-india.org
ఏవైనా సందేహాలుంటే aictefreecourses@gmail.comకు మెయిల్ చేయండి.