HomeLATESTనిరుద్యోగులకు ఎల్ఐసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 9394 ఖాళీలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఎల్ఐసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 9394 ఖాళీలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు ప్రముఖ ఎల్ఐసీ (LIC) సంస్థ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది ఎల్ఐసీ. అప్రంటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 21న అంటే ఈ రోజు ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Advertisement

జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

  1. తూర్పు జోనల్ కార్యాలయం (కోల్‌కతా) – 1049
  2. వెస్ట్రన్ జోనల్ ఆఫీస్ (ముంబై) – 1942
  3. ఉత్తర జోనల్ కార్యాలయం (న్యూ ఢిల్లీ) – 1216
  4. ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పాట్నా) – 669
  5. నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్)- 1033
  6. దక్షిణ జోనల్ కార్యాలయం (చెన్నై) – 1516
  7. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్)- 1408

మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) కింద దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఇందులో ఏపీలో కడప, మచిలీపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
READ THIS: టెన్త్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 11,400 జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

అర్హతలు..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇంకా వయోపరిమితి విషయానికి వస్తే.. జనరల్ అభ్యర్థులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లలోపు ఉండాలి. వయో పరిమితికి సంబంధించి కొందిరికి సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Advertisement

అభ్యర్థుల ఎంపిక ఇలా..

  1. ప్రిలిమ్స్
  2. మెయిన్స్
  3. ఇంటర్వ్యూ

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.licindia.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!