లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC).. అసిస్టెంట్ ఇంజనీర్ (AE),అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 491 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 81 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు కాగా.. 410 పోస్టులు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులు. బీటెక్, డిగ్రీ, సీఏ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నేటి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిపికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: అభ్యర్థులు ఆగస్టు 16 వ తేదీ నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: సెప్టెంబర్ 8 వ తేదీ వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: అక్టోబర్ 3 వ తేదీన ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
మెయిన్స్ పరీక్ష తేదీ: ఈ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్స్ పరీక్ష నవంబర్ 8న జరగనుంది.
పోస్టుల వివరాలు:
మొత్తం 491 పోస్టులు ఉన్నాయి. ఇందులో.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టులు 81 కాగా.. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టులు 410.
అసిస్టెంట్ ఇంజనీర్ (AE):
సివిల్ ఇంజనీర్: 50 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజనీర్: 31 పోస్టులు
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO): 410
జనరలిస్ట్
ఐటీ
చార్టర్డ్ అకౌంటెంట్ (CA)
యాక్చురియల్
అర్హతలు:
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
AE పోస్టులకు: సంబంధిత విభాగంలో (సివిల్/ఎలక్ట్రికల్) ఇంజనీరింగ్ డిగ్రీ (B.E/B.Tech) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
AAO పోస్టులకు: ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్). ఐటీ, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో ప్రత్యేక విద్యార్హతలు ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల కనీస వయస్సు ఆగస్టు 1 నాటికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట 30 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (Prelims), మెయిన్ పరీక్ష (Mains), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపు రూ. 92,870 జీతం లభిస్తుంది.
ఎలా అప్లై చేయాలి ?
- ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్ licindia.inలోకి లాగిన్ అవ్వండి .
- “Careers” లేదా “Recruitment” విభాగంలోకి వెళ్లి “LIC Assistant Engineer/AAO Recruitment 2025” నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత “Apply Online” లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోండి.
- అవసరమైన వివరాలను, ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింటౌట్ తీసుకోండి.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్licindia.inను సందర్శించవచ్చు.





