ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL)దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ముఖ్యంగా తెలంగాణలో 24, ఏపీలో 8 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగి ఉన్న వారు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో ఏదైనా డిగ్రీ (రెగ్యులర్ మోడ్) ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 01 ఏప్రిల్ 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:
నెలకు జీతం సుమారు రూ. 26,000 నుంచి రూ. 29,000 వరకు ఉంటుంది. వీటితో పాటు మీల్ కూపన్లు, గ్రాట్యుటీ, స్టాఫ్ హౌసింగ్ లోన్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ:
1.ఆన్లైన్ పరీక్ష: 200 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ (హౌసింగ్ ఫైనాన్స్), న్యూమరికల్ ఎబిలిటీ , కంప్యూటర్ స్కిల్స్ విభాగాలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ (0.25) కూడా ఉంటుంది.
2.పర్సనల్ ఇంటర్వ్యూ: పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
3.మెడికల్ & బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు రూ. 800 + 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్ 30 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీ (తాత్కాలికం): జూన్ మొదటి వారం.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు www.lichousing.com వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.





