Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : మే 2023

కరెంట్​ అఫైర్స్​ : మే 2023

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు టీఎస్​పీఎస్​సీ (TSPSC), టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు, గురుకుల్​ (TREI RB) పోస్టులకు నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్యాంశాలు, తెలంగాణ విశేషాలు, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు.

Advertisement

అంతర్జాతీయం

అరబ్‌ లీగ్‌లోకి సిరియా
అరబ్‌ లీగ్‌లోకి సిరియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. లీగ్‌ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచివేయడం, అంతర్యుద్ధానికి దారి తీయడంతో ఆ దేశం సభ్యత్వం రద్దైంది.

పులిట్జర్‌ అవార్డులు
చార్లెస్‌ డికెన్స్‌ రచించిన డేవిడ్‌ కాపర్‌ ఫీల్డ్‌ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్‌ రచించిన ‘డీమన్‌ కాపర్‌ ఫీల్డ్‌’ నవలతో పాటు 1920 నాటి న్యూయార్క్‌ నగరంలో మోసాల గురించి హెర్నన్‌ డియాజ్‌ రచించిన ‘ది ట్రస్ట్‌’ నవలకు పులిట్జర్‌ బహుమతులు ప్రకటించారు.

ముగ్గురి డీఎన్‌ఏతో శిశువు
బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్‌ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్‌ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా ఈ సాంకేతికత ఉయోగిస్తున్నారు.

Advertisement

తీవ్రంగా మోచా తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుపాను బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికిస్తోంది. గంటకు గరిష్ఠంగా 180- – 190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.  ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

బైడెన్‌ ఎన్నికల టీంలో భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ 2024 ఎన్నికల ప్రచార సలహా మండలిలో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. అమెరికా కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అమి బెరా, కాంగ్రెస్‌లో భారత్‌కు మద్దతు పలికే గ్రూపు ఉపాధ్యక్షులు రో ఖన్నా, సిన్సినాటి మేయర్‌ అఫ్తాబ్‌ పురేవాల్‌ సభ్యులుగా నియమితులయ్యారు

కుల వివక్షను నిషేధించే బిల్లు
కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్‌ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియానే. అఫ్గానిస్థాన్‌ సంతతికి చెందిన సెనేటర్‌ అయిషా వాహబ్‌ గత నెలలో ఈ బిల్లును (ఎస్‌బీ403) ప్రవేశపెట్టారు. 34–-1 ఓట్ల తేడాతో ఆమోద ముద్ర లభించింది.

Advertisement

‘సముద్ర శక్తి’ విన్యాసాలు
‘సముద్ర శక్తి’ పేరుతో భారత్, ఇండోనేసియా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి. ఇండోనేసియాకు సమీపంలో ఇవి జరుగుతున్నాయి. భారత్‌ తరఫున ఐఎన్‌ఎస్‌ కవరత్తి యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఒక చేతక్‌ హెలికాప్టర్‌ పాలుపంచుకుంటున్నాయి.

‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన
ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో కలిసి  ‘లిటిల్‌ ఇండియా’కు శంకుస్థాపన చేశారు. పారామాట నగరంలోని హారిస్‌ పార్క్‌లో ‘లిటిల్‌ ఇండియా’ గేట్‌ వే నిర్మించనున్నారు. ఈ పార్క్‌ వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వేడుకలను నిర్వహిస్తుంటారు.

దయనీయ దేశంగా జింబాబ్వే
ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్‌ హాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌ 103వ ర్యాంకులో నిలిచింది.

Advertisement

చార్లెస్ పట్టాభిషేకం
బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌ మే 6న పట్టాభిషేకం జరగనుంది. 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం. నిరాడంబరంగా జరగబోతున్న ఈ  వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.

అత్యంత ప్రతికూల ఏడాదిగా 2022
2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్‌ నేతృత్వంలో ‘స్టేట్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ క్లైమెట్‌ 2022’ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

మీడియా స్వేచ్ఛలో భార‌త్ ర్యాంక్‌
ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ-2023లో 161వ స్థానానికి భార‌త్‌ పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్‌ ఇప్పుడు161కి చేరింది. రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే గ్లోబల్‌ మీడియా వాచ్‌డాగ్‌ 180 దేశాలకు ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్తుంటుంది. నార్వే టాప్లో ఉంది.

Advertisement

జాతీయం

రాజస్థాన్‌లో లిథియం నిక్షేపాలు
రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు వెల్లడించారు. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.

అన్ని భాషల్లోనూ ఆకాశవాణే
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్‌ ప్రసారాల సమయంలోనూ ‘దిస్‌ ఈజ్‌ ఆల్‌ ఇండియా రేడియో’ అని కాకుండా ‘దిస్‌ ఈజ్‌ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.

భారత వృద్ధి రేటు 6 శాతం
ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్‌కు స్థిరత్వంతో కూడిన ‘బీబీబీ’ – సార్వభౌమ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు భారత్‌ నమోదు చేయొచ్చని పేర్కొంది.

Advertisement

కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డులు
విధి నిర్వహణలో  ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.

భారత హాకీ స్పాన్సర్‌గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్‌ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్‌) స్పాన్సర్‌ గా ఉంటోంది.

రాజస్థాన్‌లో లిథియం నిక్షేపాలు
రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు వెల్లడించారు. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.

Advertisement

కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డులు
విధి నిర్వహణలో  ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.

భారత హాకీ స్పాన్సర్‌గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్‌ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్‌) స్పాన్సర్‌ గా ఉంటోంది.

సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్ మే 25న‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్‌ సూద్‌ సీబీఐ డైరెక్టర్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.

Advertisement

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులో భేటీ అయిన కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) సిద్ధరామయ్యను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

రూ.2000 నోటు ఉపసంహరణ
భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)  చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ‘క్లీన్‌ నోట్‌ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

3.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్‌ జీడీపీ
2022లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించిందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న జీ-20 దేశంగా భారత్‌ నిలవనుందని, అయితే సంస్కరణలు, విధానపరమైన అడ్డంకుల వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది.

Advertisement

ఆర్చరీ ప్రపంచకప్‌లో స్వర్ణాలు
భారత యువ ఆర్చర్‌ ప్రథమేశ్‌ జవాల్కర్‌ ఆర్చరీ ప్రపంచకప్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గాడు. మరోవైపు అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జంట జ్యోతి సురేఖ, ఒజస్‌ దేవ్‌తలె వరుసగా రెండో ప్రపంచకప్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్
68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ 2023లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (ఆలియా భట్), ఉత్తమ దర్శకుడు( సంజయ్ లీలా భన్సాలీ) సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా – రాజ్‌ కుమార్‌ రావు (బదాయి దో) పురస్కారం దక్కింది.

ఎస్‌సీవో సమ్మిట్
భారత్‌ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా జరిగింది. ఈ సదస్సులో దాయాది పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్నారు.

రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు నవరత్న హోదా
రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌వీఎన్‌ఎల్‌)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంస్థ ఆథరైజ్డ్‌ షేర్‌ కేపిటల్‌ రూ.3వేల కోట్లు, పెయిడ్‌ అప్‌ షేర్‌ కేపిటల్‌ రూ.2,085 కోట్ల మేర ఉంది.

మణిపుర్లో అల్లర్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మెజారిటీ ప్రజలైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్తో గిరిజనులు, గిరిజనేతరులు(మైతై) మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న ప్రాంతంలో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేశారు.

కులగణనకు బ్రేక్
కులగణనపై నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలోని బిహార్‌ సర్కార్‌కు పట్నా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను తక్షణం నిలిపివేయాలని, ఇప్పటివరకు సేకరించిన డేటాను భద్రంగా ఉంచాలని, ఎవరితోనూ ఆ సమాచారం పంచుకోవద్దని పేర్కొంది.

ప్రాంతీయం

‘ఓడీఎఫ్‌ ప్లస్‌’ గ్రామాల్లో టాప్‌
స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. మిషన్‌ రెండో దశలో దాదాపు 50% గ్రామాలు ఓడీఎఫ్‌ ప్లస్‌ స్థాయికి చేరాయని, ఇందులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ టాప్‌లో నిలిచినట్లు వెల్లడించింది.

ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్‌
మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు క్యాబినెట్‌ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ 2019 డిసెంబరు 31 నుంచి దాదాపు మూడేళ్ల పాటు పనిచేశారు.

మైనార్టీ క‌మిష‌న్ చైర్మన్‌గా తారిఖ్
రాష్ట్ర మైనార్టీ క‌మిష‌న్ చైర్మన్‌గా తారిఖ్ అన్సారీని సీఎం  కేసీఆర్ నియ‌మించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తారిఖ్ అన్సారీ ఈ ప‌ద‌విలో మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు.

శాతవాహన కాలం నాటి ఇటుక గోడలు
తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాలను చర్రిత పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి గుర్తించారు.

‘ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌’ అవార్డు
పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) 2023 ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోల్డ్‌ పురస్కారం దక్కింది.

రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. తెలంగాణలో ఎంఐఎం, భారాసతో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.

సెక్రటేరియట్ కు గోల్డ్‌ రేటింగ్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి భారతీయ హరిత భవన మండలి (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ) ప్రతినిధుల బృందం గోల్డ్‌ రేటింగ్‌ ఇచ్చింది. దేశంలోనే గోల్డ్‌ రేటింగ్‌ పొందిన తొలి సచివాలయం తెలంగాణ.

వార్తల్లో వ్యక్తులు

నీరజ్‌ చోప్రా
రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్తో చరిత్ర సృష్టించి, నిరుడు డైమండ్‌ లీగ్‌ ఫైనల్లోనూ విజేతగా నిలిచిన నీరజ్‌ చోప్రా డైమండ్‌ లీగ్‌ కొత్త సీజన్‌లో తొలి అంచె జావెలిన్‌ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ విజేతగా నిలిచాడు.

ప్రాచీ దహబల్‌ దేబ్‌
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్‌ దేబ్‌ అనే మహిళ కేకులతో అద్భుతమైన ఆకృతులు రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా రాయల్‌ ఐసింగ్‌ విధానంలో 200 కిలోల భారతీయ రాజభవనం నమూనా కేకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

ప్రవీణ్‌
ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. హవానా (క్యూబా)లో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్‌ 17.37 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెంజిత్‌ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు (17.30 మీ., 2016)ను అతడు తిరగరాశాడు.

సబలెంకా
మహిళల టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)ను ఓడించి బెలారస్‌ స్టార్‌ సబలెంకా మాడ్రిడ్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నీలో రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సబలెంకా కెరీర్‌లో ఇది 12వ సింగిల్స్‌ టైటిల్‌.

దలైలామా
ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసె పురస్కారం ఇటీవల వ్యక్తిగతంగా అందుకున్నారు. జీవన విధానం, సంస్కృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి నాయకత్వం వహించినందుకు ఈ అవార్డును అందించారు.

ప్రవీణ్‌ సూద్‌
సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ప్రవీణ్‌ సూద్‌ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఈయన్ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్‌సూద్‌ ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

మహమ్మద్‌ హుసాముద్దీన్‌
ఐబీఏ పురుషుల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మహమ్మద్‌ హుసాముద్దీన్‌కు మోకాలి గాయం కారణంగా 57 కేజీల విభాగం సెమీస్‌లో పోటీపడలేకపోయాడు. క్యూబా బాక్సర్‌ సైడల్‌ హోర్టాకు వాకోవర్‌ ఇచ్చి కాంస్యానికే పరిమితమయ్యాడు.

సుల్తాన్‌ అల్‌ నెయాదీ
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందిన సుల్తాన్‌ అల్‌ నెయాదీ అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి అరబ్‌గా చరిత్రకెక్కారు. భూకక్ష్యలో­ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదసిలోని శూన్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్వహించారు.

నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పపువా న్యూగినియాతో పాటు ఫిజి దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి. పపువా న్యూ గినియా గవర్నర్‌ జనరల్‌ సర్‌ బాబ్‌ దాడే ‘గ్రాండ్‌ కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ లొగొహు’ అవార్డును మోదీకి బహూకరించారు. ఫిజి ప్రధాని సిటివేని రెబుకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజి’ని మోడీ మెడలో వేసి గౌరవించారు.

లిండా యాకరినా
ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా ట్విటర్‌ వ్యాపార కార్యకలాపాలపైనే లిండా దృష్టి సారిస్తారని ట్విటర్‌ ద్వారా మస్క్‌ తెలియజేశారు.

అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌
న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును ఆ మంత్రిత్వ శాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తప్పించారు. ఆయనకు భూవిజ్ఞానశాస్త్ర శాఖను అప్పగించారు. రిజిజు స్థానంలో రాజస్థాన్‌ దళిత నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ను న్యాయశాఖ నూతన మంత్రిగా నియమించారు.

సల్మాన్‌ రష్దీ
బుకర్‌ ప్రైజ్‌ విజేత అయిన అంతర్జాతీయ రచయిత సల్మాన్‌ రష్దీ మాన్‌హట్టన్‌లో గల అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీలో జరిగిన 2023 లిటరరీ గాలాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పెన్‌’ సెంటినరీ కరేజ్‌ అవార్డుతో ఆయనను సత్కరించారు.

ఎన్‌.చంద్రశేఖరన్‌
టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘షువాలె డి లా లీజియన్‌ దోనర్‌’ను ప్రకటించారు. భారత్‌ -ఫ్రాన్స్‌ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్‌ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందించారు.

అజయ్‌ బంగా
ప్రపంచ బ్యాంక్‌ కొత్త అధ్యక్షుడిగా అజయ్‌ బంగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్‌ 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది.

సిద్ధార్థ మొహంతి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)  చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. 2024 జూన్‌ వరకు  మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.

మల్లికార్జున ప్రసాద్‌
మహారత్న సంస్థ కోల్‌ ఇండియా చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం కోల్‌ ఇండియా అనుబంధ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ సీఎండీగా ప్రసాద్‌ ఉన్నారు.

అరుణ్‌ గాంధీ
ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్‌ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో అనారోగ్యంతో మరణించారు.1934, ఏప్రిల్‌ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో మణిలాల్‌ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు అరుణ్‌ గాంధీ జన్మించారు.

అఫ్షాన్‌
పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇరాన్‌కు చెందిన అఫ్షాన్‌ గదేర్‌జాదే తాజాగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. అతడి ఎడమ చేయి 6.7 సెంటీమీటర్లు, కుడి చేయి 6.4 సెంటీమీటర్ల మేర పొడవును కలిగి ఉన్నారు.

స్పోర్ట్స్

లారెస్‌ గ్లోబల్‌ అవార్డులు
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ, జమైకా స్ప్రింటర్‌ షెల్లిఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌ ఆయా విభాగాల్లో ప్రతిష్టాత్మక లారెస్‌ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు గెలుచుకున్నారు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో కలిపి మెస్సీ రెండు అవార్డులను అందుకున్నాడు.

ప్రపంచకప్‌ షూటింగ్‌
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌ సింగ్‌–దివ్య థడిగోల్‌ సుబ్బరాజు (భారత్‌) ద్వయం విజేతగా నిలిచింది.

భారత షూటర్ వరల్డ్ రికార్డ్
షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత షూటర్‌ రిథమ్‌ సాంగ్వాన్‌ నయా ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్లో క్వాలిఫికేషన్లో 595 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన రిథమ్‌.. అత్యధిక క్వాలిఫికేషన్‌ స్కోరు రికార్డును బద్దలు కొట్టింది.

పారితోషికాల్లో రొనాల్డో టాప్‌
అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించింది. ఇటీవల సౌదీ అరేబియా క్లబ్‌ అల్‌నాసర్‌కు మారిన తరువాత రొనాల్డో పారితోషికం మూడేళ్ల కాలానికి 136 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు ఫోర్బ్స్‌ తెలిపింది. మెస్సీ, ఎంబాపె తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టాప్ ప్లేస్లో నీరజ్‌ చోప్రా
భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ జావెలిన్‌ త్రోలో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్‌ (1455 పాయింట్లు) ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా, 1433)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఐహెచ్‌ఎఫ్‌ ఛాలెంజర్‌ ట్రోఫీ
అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఐహెచ్‌ఎఫ్‌) ఛాలెంజర్‌ ట్రోఫీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్‌ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.

టెస్టు క్రికెట్లో భారత్ నంబర్‌వన్‌
టెస్టు క్రికెట్లో టీమ్‌ ఇండియా నంబర్‌వన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ స్థానం సాధించింది. ఆసీస్‌ (116) రెండు, ఇంగ్లాండ్‌ (114) మూడో స్థానాల్లో నిలిచాయి.

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్స్
ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రంకిరెడ్డి సాత్విక్‌–సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి  జోడీ చరిత్రాత్మక డబుల్స్‌ స్వర్ణం సాధించింది. దీంతో  బీడబ్ల్యూఎఫ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్‌ ద్వయం అయిదో ర్యాంకులో నిలిచింది.

సైన్స్​ అండ్ టెక్నాలజీ

ఆర్మీలో ఎల‌క్ట్రిక్ జిప్సీలు
ఇండియన్‌ ఆర్మీ సెల్‌ కొత్తగా ఎలక్ట్రిక్‌ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్‌ ఈవీ స్టార్టప్‌లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్‌ జిప్సీ వాహనాలుగా మార్చేస్తుంది.

గురుగ్రహంపై జ్యూస్‌ పరిశోదన
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ‘జ్యూస్‌’ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, లిస్టో, గానీమీడ్‌ చందమామల పైనా పరిశోధనలు సాగించనుంది.

‘ఐఎన్ఎస్ మగర్’ వీడ్కోలు
నీటిలోనే కాదు.. నేలపైనా దాడి­­చేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) యుద్ధనౌక 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ మే 7వ తేదీ త‌న‌ విధులకు స్వస్తి పలికింది.

జపాన్ నౌక ఆచూకీ లభ్యం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన జపాన్‌ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దక్షిణ చైనా సముద్రంలో ’ఎస్‌ఎస్‌ మాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభించింది.

ఎంఆర్‌ శామ్‌ పరీక్ష సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ శామ్‌)ని భారత నౌకాదళం తన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలానికి చేరువగా వెళుతున్న (సీ స్కిమింగ్‌) ఒక లక్ష్యాన్ని ఇది దిగ్విజయంగా ఛేదించింది.

కరెంట్​ అఫైర్స్​ ఏప్రిల్​ 2023
కరెంట్​ అఫైర్స్​ మార్చి 2023
కరెంట్​ అఫైర్స్​ ఫిబ్రవరి 2023

కరెంట్​ అఫైర్స్​ జనవరి 2023

కరెంట్​ అఫైర్స్​ 2022 (క్లిక్​ చేసి.. ఈ బుక్​ ఉచితంగా డౌన్​లోడ్​ చేసుకొండి)​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!