Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీచర్ కొలువుల జాతర.. 13,404 ఖాళీలతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఈరోజు నుంచే..

టీచర్ కొలువుల జాతర.. 13,404 ఖాళీలతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఈరోజు నుంచే..

కేంద్రీయ విద్యాలయ సంఘటన్​ (KVS) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. KVS నుంచి రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 13,404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రైమరీ టీచర్ పోస్టుకలు సంబంధించి 6414 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల కాగా.. మరో 6,990 ఖాళీలతో ఇంకో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో టీజీటీ (TGT), పీజీటీ (PGT), సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర వివిధ పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం : 05-12-2022
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022

విద్యార్హతల వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా CTET పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. ఇంకా వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అధికారిక వెబ్ సైట్: https://kvsangathan.nic.in/

– దరఖాస్తుకు సంబంధించిన లింక్ ఈ నెల 5వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి యాక్టివేట్ అవుతుందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

6900 టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు విభాగాల వారీగా..

ఈ ఖాళీలకు సంబంధించి వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

  1. అసిస్టెంట్ కమిషనర్ – 52
  2. ప్రిన్సిపల్ – 239
  3. వైస్ ప్రిన్సిపల్ – 203
  4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) – 1409
  5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) – 3176
  6. లైబ్రేరియన్ – 355
  7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) – 303
  8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు – 06
  9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ – 02
  10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 156
  11. హిందీ ట్రాన్స్ లేటర్ – 11
  12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 322
  13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 702
  14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు – 54
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!