కేంద్రీయ విద్యాలయ సంఘటన్ , నవోదయ విద్యాలయ సమితి సంయుక్తంగా దేశవ్యాప్తంగా టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో మొత్తం 14,967పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఈడీ, బీఈడీ, ఎంఈడీ అర్హతతో పాటు సెంట్రల్ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచింగ్ పోస్టులకు , నాన్ టీచింగ్ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు( కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కలిపి)
అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల సంఖ్య: 17
ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 227 పోస్టులు
వైస్ ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 58
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల సంఖ్య: 2,996
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల సంఖ్య: 6,215
ప్రైమరీ టీచర్ పోస్టుల సంఖ్య: 2,684
మ్యూజిక్ పోస్టుల సంఖ్య: 187
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల సంఖ్య: 987 పోస్టులు
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 493 + స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 494
లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 281 పోస్టులు
నాన్ టీచింగ్ పోస్టులు 1,155
ఇతర పోస్టుల సంఖ్య: 787
( కేంద్రీయ, నవోదయలో రిక్రూట్మెంట్ వరకు రిటైర్మెంట్, ప్రమోషన్ల ఆధారంగా పోస్టుల సంఖ్య తగ్గవచ్చు. లేదా పెరగవచ్చు.)
అర్హతలు
పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్/ 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, అర్హత కలిగి ఉండాలి. పీజీటీ, టీజీటీ పోస్టులకు సీటెట్ అర్హత తప్పనిసరి. ప్రత్యేక రిజర్వేషన్ ఉన్న వారికి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ లో నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 4 వరకు దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం https://examinationservices.nic.in/recsys2025/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFbEsl0hvvhEEwgxfU0IzC28jtU4yhpqb3pomlo4g+VC8వెబ్సైట్ క్లిక్ చేయండి.





