హైదరాబాద్ లోని కోఠి మహిళా యూనివర్సిటీ కళాశాలలో బేసిక్స్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ (బీఎఫ్ఎస్), బేసి క్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ (బీఎఫ్ఎస్) ఆరునెలల సర్టిఫికెట్ కోర్సు ల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కోర్సు కోఆర్డినేటర్ జోగరాజు అన్నపూర్ణ తెలిపారు. ఇంటర్ తత్సమాన విద్యార్హతలున్న మహిళా అభ్యర్థులు ఈ నెల 15 వరకు http/www.oucw koti.ac.in వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. కోర్సు వివరాలు కోసం 9666629764 కాల్ చేయాలని ఉమెన్స్ కాలేజ్ ఒక ప్రకటనలో తెలిపింది