కేంద్రీయ విద్యాలయాల్లో 2022–23 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటోతరగతి నుంచి పదకొండో తరగతి వరకు ప్రవేశాల కోసం న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ
ఒకటో తరగతికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగిలిన తరగతులకు రిజిస్ట్రేషన్ ఫారాన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నింపి బర్త్ సర్టిఫికేట్, ఫోటో, ఆధార్ జతచేసి కేవీఎస్ ఈ మెయిల్‌కు పంపాలి.
సీట్ల వివరాలు
ఒకటో తరగతి నుంచి ప్రతి తరగతిలో కనీసం 40 సీట్లు, పదకొండొ తరగతిలో 55 సీట్లు ఉంటాయి. ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3శాతం సీట్లు కేటాయిస్తారు. పార్లమెంట్ సభ్యులు, కేవీఎస్ ఉన్నతాధికారులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు సిఫార్సు చేసిన వారికి అడ్మిషన్స్ ఇస్తారు. గత ఏడేళ్ల కాలంలో ఉద్యోగులు పొందిన ట్రాన్స్ఫర్స్ల సంఖ్యను అనుసరించి విద్యార్థుల ప్రవేశ ప్రక్రియలో ప్రాధాన్యం కల్పిస్తారు. ఉద్యోగుల ఏకైక సంతానంగా అమ్మాయి ఉంటే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
అడ్మిషన్ ప్రాసెస్
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎలాంటి అడ్మిషన్ టెస్ట్‌లు ఉండవు. ప్రయారిటీ కేటగిరి సిస్టం ప్రకారం అడ్మిషన్స్ ఇస్తారు. సీట్ల కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ సిస్టం ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టుల ఒక్కోదానిలో 20 ప్రశ్నలడుగుతారు. అర్హత సాధించాలంటే 33 శాతం మార్కులు పొందాలి. తొమ్మిదోతరగతి తర్వాత పదోతరగతికి ప్రమోట్ చేస్తారు. పదోతరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే పదకొండోతరగతి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సైన్స్ విభాగాల్లో ప్రవేశానికి 60శాతం, కామర్స్ విభాగానికి 55 శాతం, మార్కులు సాధించాలి. మిగిలిన సీట్లను ఎన్ఐఓఎస్, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డుల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
ఒకటో తరగతి అడ్మిషన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: మార్చి 21
2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు గడువు : ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 21.
మిగిలిన సీట్ల ప్రవేశాల ప్రక్రియ ముగింపు : జూన్ 30
వెబ్సైట్ : www.kvsangathan.nic.in