HomeLATESTసీఎం కేసీఆర్​ ఫెలోషిప్ : నెలకు రూ.10వేలు

సీఎం కేసీఆర్​ ఫెలోషిప్ : నెలకు రూ.10వేలు

​తెలంగాణా విద్యార్థులకు సీఎం కేసీఆర్​ పేరుతో ఫెలోషిప్ అందించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఓయూలో పీహెచ్​డీ చేస్తున్న ప్రతి స్టూడెంట్​కు కేసీఆర్​ డాక్టోరల్​ ఫెలోషిప్​ పేరిట నెలకు రూ.10వేల చొప్పున ఇవ్వాలని భావిస్తోంది. జేఆర్​ఎఫ్​, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మౌలానా అజాద్​ తదితర ఫెలోషిప్​ల కింద ఆర్థిక సహకారం అందని విద్యార్థులకు కేసీఆర్​ డాక్టోరల్​ ఫెలోషిప్ ​(కేడీఎఫ్​) ఇవ్వాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంంది. ఈ ప్రతిపాదనలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వానికి పంపించింది.

Advertisement

ఓయూలో ప్రస్తుతం దాదాపు అయిదు వేల మంది పీహెచ్​డీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 30 శాతం మందికి వివిధ స్కీంల కింద ఫెలోషిప్​ అందుతోంది. మిగతా విద్యార్థులు ఫెలోషిప్​ అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి ప్రస్తుతం హెచ్​సీయూ సహా పలు యూనివర్సిటీలు నాన్​నెట్​ ఫెలోషిప్​ కింద ప్రతి విద్యార్థికి రూ.10వేల వరకు ఫెలోషిప్​ను అందిస్తున్నాయి. అదే విధంగా ఓయూలో సీఎం కేసీఆర్​ పేరుతో​ ఫెలోషిప్​ కింద రూ.10వేలు అందిస్తే బాగుంటుందని ఓయూ భావిస్తోంది. ఇటీవల జరిగిన వీసీ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్​ సోమేష్​కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్​ ఆచార్య లింబాద్రి ఓయూ వైస్​ ఛాన్సలర్​ ఈ ఫెలోషిఫ్​ వివరాలను ప్రస్తావించారు. ఈ ఫెలోషిఫ్​ అందించే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!