ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. త్వరలోనే 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ’కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రంలో 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేసినం. ఇప్పటివరకు 1.33 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినం. 22 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. విద్యుత్ విభాగంలో దాదాపు 22 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినం. రాష్ట్రంలో 95 శాతం స్థానికులకే ఉద్యోగులు వచ్చేందుకు వీలుగా కొత్త జోన్లు, మల్టీ జోన్ల ఉత్తర్వులు తెచ్చుకున్నం. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసినం. రాష్ట్రంలో మొత్తం 91142 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటిని ఈరోజు నుంచే నోటిఫై చేస్తాం. ఇప్పుడున్న 11103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఈ రోజు నుంచే రెగ్యులరైజ్ చేస్తాం. మిగతా 80039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా విభాగాలు నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. అత్యధికంగా విద్యాశాఖలోనే దాదాపు 25 వేల ఖాళీలున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు ఈ ఖాళీలున్నాయి. వీటన్నింటిని త్వరలోనే భర్తీ చేస్తాం..’అని సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటనను అసెంబ్లీలో చదివి వినిపించారు.
సీఎం పూర్తి ప్రకటన
FINAL-CM-SIRS-STATEMENT