తెలంగాణలోని ప్రముఖ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తాజాగా కీలక ప్రకటన చేసింది. యాజమాన్య కోటా పీజీ వైద్య, దంత విద్య సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సిలింగ్ కు అనర్హులని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 25, 26వ తేదీల్లో ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.