HomeLATESTఎన్‌హెచ్‌పీసీలో 133 జూనియర్‌ ఇంజినీర్స్​ పోస్టులు

ఎన్‌హెచ్‌పీసీలో 133 జూనియర్‌ ఇంజినీర్స్​ పోస్టులు

నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) జూనియర్​ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. సివిల్​, ఎలక్ట్రికల్​, మెకానికల్​ విభాగాల్లో మొత్తం 133 ఖాళీలు ఉన్నాయి.

Advertisement

ఖాళీలు: 133

విభాగాల వారీగా పోస్టులు: సివిల్‌-68, ఎలక్ట్రికల్‌-34, మెకానికల్‌-31.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

Advertisement

వయసు: 30 ఏళ్లు మించరాదు.

సాలరీ: నెలకి రూ.29,600 నుంచి రూ.1,19,500 వరకు చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షని మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 200 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో 140 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న సంబంధిత టెక్నికల్‌ సబ్జెక్టు నుంచి, 30 ప్రశ్నలు జనరల్‌ అవేర్‌నెస్‌, 30 ప్రశ్నలు రీజనింగ్‌ నుంచి ఉంటాయి. పరీక్షా సమయం 3 గంటలు ఉంటుంది. ఈ పరీక్షని ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పత్రి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కొత విధిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరితేది: 21 ఫిబ్రవరి

Advertisement

వెబ్​సైట్: www.nhpcindia.com

ఇండియన్‌ ఆర్మీ-ట్రాన్సిట్‌ క్యాంప్స్‌లో సివిలియన్​ పోస్టులు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన ట్రాన్సిట్‌ క్యాంప్స్‌/ మూవ్‌మెంట్‌ కంట్రోల్‌ గ్రూప్‌/ మూవ్‌మెంట్‌ కంట్రోల్‌/ మూవ్‌మెంట్‌ ఫార్వర్డింగ్‌ డిటాచ్‌మెంట్స్‌లో గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 41

Advertisement

1) ఎంటీఎస్‌ (సఫాయివాలా): 10

2) వాషర్‌మెన్‌: 3

3) మెస్‌ వెయిటర్: 6

Advertisement

4) మసాల్చి: 2

5) కుక్‌: 5

6) హౌజ్‌ కీపర్‌: 2

Advertisement

7) బార్బర్‌: 2

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

సాలరీ: నెలకి రూ.5200 నుంచి రూ.20,200 + గ్రేడ్‌ పే రూ.1800 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పదో తరగతి స్థాయిలో ఈ పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌కి పిలుస్తారు.

Advertisement

దరఖాస్తులు: ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022, జనవరి 29-ఫిబ్రవరి 04)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్​సైట్​: www.mod.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!