సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్ లో జనవరి 17 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. హెడ్ క్వార్టర్ కోటా కింద సోల్జర్ టెక్నీషియన్, ట్రేడ్స్‌మెన్ కేటగిరిల్లో, స్పోర్ట్స్ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 17 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని బొల్లారం వన్ ఐఎంఈ సెంటర్లో సంప్రదించాలని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు awwalegle@gmail.com, లేదా
వెబ్సైట్: www.joinindianarmy.nic.inలో సంప్రదించాలని సూచించారు.
ఆరు వర్సిటీలకు తొలిసారి కామన్ క్యాలెండర్
రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో తొలిసారిగా పీజీ1 ,3 సెమిస్టర్లకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల్లో.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ తదితర కోర్సులకు ఇక నుంచి ఉమ్మడి అకమిక్ క్యాలెండర్ అమలు కానుంది. విద్యార్థులకు ఒకే సారి క్లాసులు ప్రారంభించి ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 27 నుంచి పీజీ ఫస్టియర్ వారికి తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 26 నుంచి 2, 4 సెమిస్టర్లను ప్రారంభించనున్నట్టు అధికారులు అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు.
ఉర్దూ యూనివర్సటీ మనూలో టీచింగ్ పోస్టులు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సటీ మనూలో కాంట్రాక్ట్ బేసిస్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సైకాలజీ, హిందీ, మ్యాథమేటిక్స్, సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బోధించేందుకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, ఎంఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నెట్, స్లెట్, సెట్ స్కోర్ కలిగి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూలు డిసెంబర్ 27, 29 తేదీల్లో మనూ క్యాంపస్‌లో ఉంటాయి.
వెబ్సైట్ :www.manuu.edu.in
టాటా మెమోరియల్ సెంటర్లో నర్సు పోస్టులకు నోటిఫికేషన్
టాటా మెమోరియల్ సెంటర్ వారణాసిలో నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జీఎన్ఎం, డిప్లొమా ఇన్ ఆంకాలజీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగిన వారు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు చివరితేదీ జనవరి 08.
వెబ్సైట్ : www.tmc.gov.in
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో ట్రెయినీ ఆఫీసర్స్ జాబ్స్
హరియాణాలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బీఈ/బీటెక్/బీఎస్సీ సెక్రటరీ, సీఏ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. గేట్ –2021 / సీఏ/సీఎంసీ/ సీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ జనవరి 17.
వెబ్సైట్ :www.nhpcindia.com