సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నేషనల్ కెమికల్ లాబొరేటరీ సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు అసెసియేట్ 1 పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకూడాషురూ అయ్యింది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక పోర్టల్ ncl-india.org ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జూన్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
అర్హత:
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. 4ఏండ్ల అనుభవం, ఎం.టెక్, 2ఏండ్ల అనుభవం తప్పనిసరి ఉండాలి. ప్రాజెస్టు అసోసియేట్ 1 అభ్యర్థులు 2ఏండ్ల అనుభవంతో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.
వయస్సు:
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ 40ఏండ్లు, ప్రాజెక్టు అసోసియేట్ 1 నుంచి 35ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం:
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ రూ. 42వేలు, హెచ్ఆర్ఏ, ప్రాజెక్టు అసోసియేట్ 1 రూ. 25వేల నుంచి రూ. 31వేలు ఉండాలి.
ఎంపిక:
ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక అవుతారు.
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేషనల్ కెమికల్ లాబొరేటరీ అధికారిక వెబ్ సైట్ ద్వారా అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.