ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (IC) కింద టెక్నికల్ అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్ పోస్టుల కోసం ICMR ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఖాళీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 8వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు ICMR NIE, nie.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, మొత్తం 33 గ్రూప్ బి టెక్నికల్ అసిస్టెంట్, 14 గ్రూప్ సి లాబొరేటరీ పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.
ఖాళీల సంఖ్య:
టెక్నికల్ అసిస్టెంట్ (నెట్‌వర్కింగ్): 1 పోస్ట్
టెక్నికల్ అసిస్టెంట్ (ప్రోగ్రామర్): 5 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (లేబొరేటరీ): 5 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (రీసెర్చ్ మేనేజ్‌మెంట్): 1 పోస్ట్
టెక్నికల్ అసిస్టెంట్ (సోషల్ సైన్స్): 2 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లిక్ హెల్త్): 5 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ యాక్టివిటీస్): 5 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్): 2 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (కమ్యూనికేషన్): 1 పోస్ట్
లేబొరేటరీ అటెండెంట్-1 (ల్యాబొరేటరీ) ) : 2 పోస్టులు
లాబొరేటరీ అటెండెంట్-1 (ఎయిర్ కండిషనింగ్): 1 పోస్ట్
లాబొరేటరీ అటెండెంట్-1 (ప్లంబర్): 1 పోస్ట్
లాబొరేటరీ అటెండెంట్-1 (జనరల్): 10 పోస్టులు
అర్హత, వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హత, వయోపరిమితిని కలిగి ఉండాలి. అడ్మిట్ కార్డ్ నవంబర్ మూడో వారంలో విడుదల అవుతుంది. రాత పరీక్ష నవంబర్ నాలుగో వారంలో నిర్వహిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఫీజు రూ. 300. మహిళలు, SC, ST, PWBD, Ex-Servicemen (ESM) అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ICMR ఉద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి ఎలాంటి మినహాయింపు లేదు.