DRDOలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 19గా నోటిఫికేషన్ లో పేర్కొంది.
అర్హత:
ఈ రిక్రూట్ మెంట్ కోసం అప్లయ్ చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యేయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్ తో కంప్యూటర్ ఇంజనీరింగ్ తో ఎంఈ,ఎంటెక్ చేసి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 28ఏండ్లు ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5ఏండ్లు, ఓబీసీలకు 3ఏండ్ల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 37వేలు జీతంతోపాటు హెచ్ఆర్ఏ చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
డీఆర్డీవో ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వాన్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ అవుతారు.
తేదీ: 19-06-2024, 20-06-2024
రిపోర్టింగ్ సమయం: 08:30 ఉదయం నుండి 10:00 రాత్రి వరకు