HomeLATESTJobs in KIA: ప్రతిష్టాత్మక కియా మోటార్స్ లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

Jobs in KIA: ప్రతిష్టాత్మక కియా మోటార్స్ లో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీన మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కియా మోటార్స్ తో పాటు KIML సంస్థలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీలు విద్యార్హతల వివరాలు:
KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. నీమ్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచ్ లో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2016-21 మధ్య పాసై ఉండాలి. వయస్సు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు రూ.2 వేల ఇన్సెంటీవ్స్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం ఉంటుంది. ఎంపికైన వారు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది.
KIML: నీమ్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.12,400 వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు హిందూపూర్ లో పని చేయాల్సి ఉంటుంది.
Postal Jobs 2022: పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

ఇతర వివరాలు:
– అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
– ఇంటర్వ్యూలను ఎంప్టాయిమెంట్, కోర్ట్ రోడ్, అనంతపురం, అనంతపురం జిల్లా లో నిర్వహిస్తారు.
– ఇతర వివరాలకు 8317520929 నంబర్ ను సంప్రదించవచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!