సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ‘సీ–డాక్’ హైదరాబాద్లో సాప్ట్వేర్ టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంబడెడ్ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్, వీఎల్ఎస్ఐ డిజైన్ విభాగాల్లో మొత్తం 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రాజెక్ట్ మేనేజర్లు–02.
ప్రాజెక్ట్ లీడర్/ప్రాజెక్ట్ ఇంజినీర్లు–08,
ప్రాజెక్ట్ ఇంజినీర్లు–41,
ప్రాజెక్ట్ అసోసియేట్లు –03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులను అనుసరించి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 30 చివరితేది.
వెబ్సైట్ : www.cdac.in