రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల తుది లెక్కలు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలోనే రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. ఈ నెల 15వ తేదీ లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. వాటిని సీఎం కేసీఆర్‌కు సత్వరమే అందించాలని సీఎస్ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ఉద్యోగ ఖాళీలపైనే ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో జోనల్ బదలాయింపులు, బదిలీలు, నియామకాలు పూర్తయినందును శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత వచ్చింది. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు వాటి వివరాలు నాలుగైదు 15వ తేదీ లోపు సమాచారం అందించాలన్నారు.
త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణలో త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 317 జీవో వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. కొత్త జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చేశామన్నారు. మల్టీ జోనల్ పోస్టింగ్ విధానం తీసుకోచ్చామని కేసీఆర్ అన్నారు. దీని ద్వారా 5 శాతం మాత్రమే నాన్ లోకల్స్ కు ఇచ్చామన్నారు.
ప్రిపరేషన్లో స్పీడ్ పెంచిన నిరుద్యోగులు
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయయనే ఎదురుచూస్తోన్న యువతకు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఆశల్లో ఉన్నారు. ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో సీఎం కేసీఆర్ కూడా ఇటీవలే నోటిఫికేషన్లు ఇస్తామనే మాటతో నిరుద్యోగులు ప్రిపరేషన్లో వేగం పెంచారు. గురువారం జరిగిన ఉద్యోగాల నియామకాల సమీక్షలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఖాళీల వివరాలు 15వ తేదీ లోగా సమర్పించాలని ఆదేశించడంతో ఈ నెలఖరుకు లేదంటే మార్చిలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారంలో లెక్క తేలనున్న ఉద్యోగ ఖాళీలు.. నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS