HomeLATESTజవ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్​

జవ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్​

హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) 2022-23 విద్యా సంవ‌త్సరానికి నాలుగేళ్ల బ్యాచిల‌ర్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్​ 20వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

బ్యాచిల‌ర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ): ఈ కోర్సులో అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్‌, స్కల్‌ప్చర్‌, యానిమేష‌న్‌, ఫొటోగ్రఫీ విభాగంలో మొత్తం 210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియ‌ర్ డిజైన్‌): ఇందులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. కోర్సు డ్యురేషన్ 4 సంవ‌త్సరాలు ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఏడీఈఈ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జులై 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా జూన్​ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్​ క్యాండిడేట్స్​ రూ.1800, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900 ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం www.jnafauadmissions.com వెబ్​సైట్​ సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!