HomeLATESTజేఈఈ 2023 సిలబస్​లో మార్పులు

జేఈఈ 2023 సిలబస్​లో మార్పులు

విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో 2023 నుంచి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్​డ్​ లో కొత్త సిలబస్​ అమల్లోకి రానుంది. ఎన్​సీఈఆర్​టీ సిలబస్‌కు అనుగుణంగా సులువైన స్కోరింగ్​కు అవకాశం ఉన్న అంశాలను కొత్త సిలబస్​లో చేర్చనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియేట్​ బోర్డ్​ ఎన్​సీఈఆర్​టీ సిలబస్​నే ఫాలో అవుతుండడంతో విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది.

మ్యాథ్స్​లో కొత్త టాపిక్స్​

మార్చిన సిలబస్​తో బోర్డ్​ పరీక్షలకు ప్రిపేరవుతూనే జేఈఈ అడ్వాన్స్​డ్​పై దృష్టి పెట్టవచ్చు. సిలబస్​లో ముఖ్యంగా మ్యాథ్స్​లో హార్మోనిక్​ ప్రొగ్రెషన్​, సొల్యూషన్​ ఆఫ్​ ట్రయాంగిల్స్​ తదితర టాపిక్​లను తొలగించి స్టాటిస్టిక్స్​, ఫండమెంటల్స్​ ఆఫ్​ ఆల్జీబ్రా, క్వాడ్రాటిక్​ ఈక్వేషన్స్​ వంటి అంశాలను…. కెమిస్ట్రీలో న్యూక్లియర్​ కెమిస్ట్రీని తొలగించి బయో కెమిస్ట్రీ, ఫిజికల్​ కెమిస్ట్రీలో కొత్త అంశాలను చేర్చారు. ఫిజిక్స్​లోనూ ఈజీగా స్కోరింగ్​కు అవకాశం ఉన్న అనేక అంశాలను సిలబస్​లో చేర్చారు.

రివిజన్​తో మంచి రిజల్ట్స్​

రిఫరెన్స్​ పుస్తకాల అవసరం లేకుండానే కేవలం ఎన్​సీఈఆర్​టీ పుస్తకాలను చదవడం పూర్తి చేసి రిజిజన్​ చేసుకుంటే బోర్డు పరీక్షలతో పాటు జేఈఈలోనూ మంచి ఫలితం సాధించవచ్చు. ​అయితే స్టేట్​ సిలబస్​ను జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్షకు నిర్ణయించడంతో విద్యార్థుల నుంచి పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!