ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) అడ్మిట్ కార్డులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఇందుకు సంబంధించిన పరీక్షలు రేపటి నుంచి అంటే.. జనవరి 28 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేయడం ఇలా..
Step 1: https://jeemain.nta.nic.in/ లింక్ ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో కనిపించే JEE(Main) 2023 Session 1 – Download Admit Card ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ నమోదు చేయాలి.
Step 4: హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేయసుకుని ప్రింట్ తీసుకోవాలి.