దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో (మే 2) ముగియనుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో టాప్ 2.5 లక్షల మందిలో నిలిచి, అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్లకు చివరి తేదీ: అభ్యర్థులు మే 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: మే 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుంది.
నిర్వహణ సంస్థ: ఈ ఏడాది ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల ఆధారంగా కేటగిరీల వారీగా ఎంపికైన సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు.
ఎలా అప్లై చేసుకోవాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
1.ముందుగా జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక పోర్టల్ https://jeeadv.ac.in/ లాగిన్ అవ్వాలి.
2.జేఈఈ మెయిన్స్ రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
3.అవసరమైన డాక్యుమెంట్స్ (సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం) అప్‌లోడ్ చేయాలి.
- పరీక్ష ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
పరీక్ష విధానం:
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1,పేపర్ 2) ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరు కావాలి. మే 17న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) జరుగుతుంది.





