జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE ADVANCED 2022) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్‌లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. టాప్-10లో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్) కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ముంబాయి ఐఐటీ ఈ ఫలితాలను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డికి 2వ ర్యాంకు సాధించాడు. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, విజయవాడ విద్యార్థి పొలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుందకు 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞానమహేశ్ కు 10వ ర్యాంకుతో టాపర్ల జాబితాలో నిలిచారు. రేపటి నుంచి జేఈఈ సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లో 16,598 సీట్లకు ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
JEE ADVANCE 2022 RESULT DIRECT LINK
JEE Advanced 2022 Toppers List
Rank | Name |
1 | Shishir R K |
2 | Polu Lakshmi Sai Lohith Reddy |
3 | Thomas Biju Cheeramvelil |
4 | Vangapalli Sai Siddhartha |
5 | Mayank Motwani |
6 | Polisetty Karthikeya |
7 | Pratik Sahoo |
8 | Dheeraj Kurukunda |
9 | Mahit Gadhiwala |
10 | Vetcha Gnana Mahesh |
జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్-10 ర్యాంకర్లు వీరే…
1. ఆర్కే శిశిర్
2. పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి
3. థామస్ బిజు చీరంవెల్లి
4. వంగపల్లి సాయి సిద్ధార్థ
5. మయాంక్ మోత్వానీ
6. పొలిశెట్టి కార్తికేయ
7. ప్రతీక్ సాహు
8. ధీరజ్ కురుకుంద
9. మహిత్ గఢీవాలా
10. వెచ్చా జ్ఞాన మహేశ్