తెలంగాణా లోని ప్రభుత్వ,ప్రైవేటు ఐ టీ ఐ ల లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఐటీఐ కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లకు రాష్ట్ర ఉపాది కల్పన శిక్షణ విభాగం నోటిపికేషన్ విడుదల చేసింది. ఐటీఐలో చేరాలనుకునే విద్యార్థులు జులై 14 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. టెన్త్ పాసైన విద్యార్థులందరూ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. కొన్ని ట్రేడ్‌ల్లో చేరేందుకు 8వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది.
రాష్ట్రంలో 63 గవర్నమెంట్ ఐటీఐలతో పాటు 208 ప్రైవేటు ఇన్ స్టిట్యూట్లు ఉన్నాయి. ఒకే అప్లికేషన్, వెబ్ ఆప్షన్ల ఆదారంగా అన్ని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. సీట్ల భర్తీకి మెరిట్ కమ్ రిజర్వేషన్ పద్ధతి పాటిస్తారు.
అప్లై చేసే ముందు విద్యార్థులు తప్పనిసరిగా తమ సొంత ఆధార్ కార్డు, సొంత మొబైల్ నెంబర్, సొంత మెయిల్ ఐడీ సిద్ధంగా ఉంచుకోవాలి. కాలేజీల్లో వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
పూర్తి వివరాలు, ప్రాస్పెక్టస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్లో అప్లై చేసేందుకు వెబ్సైట్ https://iti.telangana.gov.in/
