ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీబీపీ) 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: మొత్తం 526 ఖాళీల్లో సబ్-ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్)- పురుషులు: 78, మహిళలు: 14, హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)- పురుషులు: 325, మహిళలు: 58, కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)- పురుషులు: 44, మహిళలు: 7 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఎస్సై పోస్టులకు డిగ్రీ లేదా బీటెక్; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ/ డిప్లొమా ; కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఎస్సై పోస్టులకు 20 నుంచి 25, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.itbpolice.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.