ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC).. తూర్పు జోన్ పరిధిలో పనిచేయడానికి హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు కోల్‌కతాలో డిసెంబర్ రెండవ వారంలో నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు- 50
సంస్థ పేరు: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్
పోస్ట్ పేరు: హాస్పిటాలిటీ మానిటర్
విద్యార్హతలు:
అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుంచి ఫుల్-టైమ్ రెగ్యులర్ కోర్సు చేసి ఉండాలి. NCHMCT అనుబంధ CIHM/SIHM నుంచి B.Sc. ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పాసై ఉండాలి. లేదా ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ నుంచి BBA/MBA (క్యులినరీ ఆర్ట్స్)/ UGC/AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc. హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్/ UGC/AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA (టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
అనుభవం: పోస్ట్-క్వాలిఫికేషన్ కనీసం 2 సంవత్సరాల సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 01-11-2025 నాటికి అభ్యర్థులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతంతో పాటు అదనంగా రోజుకు రూ.350 డైలీ అలవెన్స్, రూ. 240 లాడ్జింగ్ అలవెన్స్, నేషనల్ హాలిడే అలవెన్స్ రూ. 384, మెడికల్ ఇన్సూరెన్స్ లభిస్తాయి.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కేవలం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇందులో ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తరువాత పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలో మెరిట్ , పనితీరు ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే విధానం:
అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. IRCTC అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దానిలో అవసరమైన వివరాలు నింపి, ఇంటర్వ్యూ కోసం హాజరుకావాల్సి ఉంటుంది
తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్:
- అప్లికేషన్ ఫారం.
2. ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్
3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఇంటర్వ్యూ ప్రదేశం, సమయం:
వేదిక: IRCTC Zonal Office, 3 Koilaghat Street, Ground Floor, Kolkata – 700 001.
తేదీలు:ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిసెంబర్ 08, 09 & 10 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.





