ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పైప్‌లైన్స్ డివిజన్‌లో టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 537 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆగస్ట్ 29వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 18 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).
పోస్టుల పేరు: అప్రెంటిస్ (టెక్నీషియన్ & ట్రేడ్)
మొత్తం ఖాళీలు: 537.
ఖాళీల వివరాలు (ప్రాంతాల వారీగా):
తూర్పు ప్రాంత పైప్‌లైన్‌లు: 156
పశ్చిమ ప్రాంత పైప్‌లైన్‌లు: 152
ఉత్తర ప్రాంత పైప్‌లైన్‌లు: 97
దక్షిణ ప్రాంత పైప్‌లైన్‌లు: 47
ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్‌లు: 85
చివరి తేదీ: అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: iocl.com
అర్హత:
విద్యార్హత: పోస్టును బట్టి అర్హతలు మారతాయి. అభ్యర్థులు డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చెక్ చేయండి.
వయస్సు: కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
సిలబస్: పరీక్ష సిలబస్‌లో సంబంధిత ట్రేడ్ లేదా డిసిప్లిన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఎలా అప్లై చేయాలి ?
1.ముందుగా IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com లోకి లాగిన్ అవ్వాలి.
2.హోమ్‌పేజీలో “కెరీర్స్” విభాగంలోని అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 పై క్లిక్ చేయండి.
3.నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హత ప్రమాణాలను సరి చూసుకోండి.
4.ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
5.అవసరమైన డాక్యుమెంట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
6.అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
7.అనంతరం అప్లికేషన్ ఫారమ్ ప్రింటౌట్ తీసుకోండి.





