HomeJOBSఐఓసీఎల్‌లో 2,756 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివిగో !

ఐఓసీఎల్‌లో 2,756 అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలివిగో !

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. రిఫైనరీ విభాగాలలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,756 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ట్రేడ్స్,టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. ఈ రోజు (నవంబర్ 28) నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 18.

పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 2,756
సంస్థ పేరు- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
పోస్ట్ పేరు- అప్రెంటిస్

అర్హతలు:

  1. విద్యార్హత:
    అభ్యర్థులు పోస్టును బట్టి కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.

ట్రేడ్ అప్రెంటిస్ (అటెండెంట్ ఆపరేటర్): బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటిస్: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి

ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్/ఇతరాలు): టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ఇతర ట్రేడ్‌లు: B.A, B.Com, B.Sc వంటి డిగ్రీ లేదా ఇంటర్ అర్హత కలిగి ఉండాలి.

  1. వయస్సు: 18నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST (5 సంవత్సరాలు), OBC-NCL (3 సంవత్సరాలు), PwBD (10 సంవత్సరాలు) అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  2. ఎంపిక విధానం: అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది.
    రాత పరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్: అభ్యర్థుల ప్రాథమిక అర్హతను పరిశీలించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
    స్కిల్ టెస్ట్/ఫిజికల్ టెస్ట: కొన్ని ట్రేడ్‌లకు అవసరమైతే నిర్వహిస్తారు.
    డాక్యుమెంట్ వెరిఫికేషన్ : రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
    మెడికల్ టెస్ట్: తుది ఎంపికకు ముందు మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి.

అప్లికేషన్లకు ప్రారంభ తేదీ: నవంబర్ 28 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి ?
అర్హత ఉన్న అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్రింది విధంగా అప్లై చేసుకోవచ్చు.
ముందుగా iocl.com అనే అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి. తర్వాత హోమ్‌పేజీలో “Apprentices Recruitment 2025″ సంబంధించిన లింక్‌ను వెతకండి. అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలను .”Apply Online” లింక్‌పై క్లిక్ చేయండి. మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోండి. అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను ఎంటర్ చేయండి.అనంతరం అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేయండి. అప్లికషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేసి.. ప్రింట్ అవుట్ తీసుకోండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here