దేశంలోని ప్రముఖ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 470 పోస్టులను భర్తీ చేయనున్నారు.పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు.కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అయితే.. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటితో (సెప్టెంబర్ 3) గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొత్తం.. 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిని గ్రేడ్-ఏ, గ్రేడ్-ఏ0, గ్రేడ్-ఇ0 కేటగిరీలుగా విభజించారు. సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, లా, మార్కెటింగ్, క్వాలిటీ కంట్రోల్ వంటి వివిధ విభాగాలలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
2.జీతం, పే స్కేల్ వివరాలు:
ఈ ఉద్యోగాలలో ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం లభిస్తుంది.
గ్రేడ్-ఏ పోస్టులకు: బేసిక్ పే రూ.50,000 ఉండగా.. సీటీసీ సుమారు రూ.18.4 లక్షల వరకు ఉంటుంది.
గ్రేడ్-ఏ0 పోస్టులకు: బేసిక్ పే రూ.40,000 ఉండగా.. వార్షిక సీటీసీ సుమారు రూ.14.8 లక్షల వరకు లభిస్తుంది.
గ్రేడ్-ఇ0 డిప్లొమా ఇంజినీర్ పోస్టులకు: ప్రారంభ బేసిక్ పే రూ.30,000 ఉండగా.. వార్షిక సీటీసీ సుమారు రూ. 11.1 లక్షల వరకు ఉంటుంది.
వీటితో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (DA), హెచ్‌ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వంటి అదనపు ప్రయోజనాలు వర్తిస్తాయి.
- విద్యార్హతలు, వయసు పరిమితి:
అభ్యర్థులు సంబంధిత టెక్నికల్ విభాగంలో.. పూర్తి కాలపు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ..పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయసు పోస్టును బట్టి 26 నుంచి 30 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. - ఎంపిక విధానం :
IOCL ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో.. జనరల్ ఆప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సీబీటీ పరీక్షలో.. మెరిట్ సాధించిన వారిని గ్రూప్ డిస్కషన్ , గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. వీటన్నింటిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
5.అప్లికేషన్ విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా.. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1,000 + జీఎస్‌టీ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. సెప్టెంబర్ 24న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.





