ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. నార్తర్న్ రీజియన్‌లోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 433 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు.ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు , అర్హతలు:
ఈ నోటిఫికేషన్లో వివిధ రకాల టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.
టెక్నీషియన్ అప్రెంటిస్: మెకానికల్,ఎలక్ట్రికల్,సివిల్,ఇన్స్ట్రుమెంటేషన్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమా పూర్తి చేసినవారు వీటికి అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ (ITI): టెన్త్ అర్హతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్ వంటి ట్రేడ్లలో ఐటీఐ (NCVT/SCVT) సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (B.A, B.Sc, B.Com, BBA) పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO): ఇంటర్ పాసైన ఫ్రెషర్స్ , స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఈ పోస్టులకు పోటీ పడొచ్చు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించడం లేదు. అభ్యర్థులు తమ అర్హత పరీక్షలో (డిప్లొమా, ఐటీఐ లేదా డిగ్రీ) సాధించిన మార్కుల ఆధారంగా.. మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్లో నిలిచిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 7 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు IOCL అధికారిక వెబ్సైట్ www.iocl.com ద్వారా చివరి తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.





