HomeJOBSఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్లకు ఈ రోజే లాస్ట్

ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు.. అప్లికేషన్లకు ఈ రోజే లాస్ట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 501 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. అప్లికేషన్లకు నేడే చివరి తేదీ కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

మొత్తం- 501 పోస్టులు

విద్యార్హత:

1. ట్రేడ్ అప్రెంటిస్ – ITI అభ్యర్థుల కోసం

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2 ఏళ్ల రెగ్యులర్ ఐటీఐ (ITI) పూర్తి చేసి ఉండాలి.

2. టెక్నీషియన్ అప్రెంటిస్ – డిప్లొమా అభ్యర్థుల కోసం

సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 ఏళ్ల రెగ్యులర్ డిప్లొమా కలిగి ఉండాలి. జనరల్/EWS/OBC అభ్యర్థులకు కనీసం 50% మార్కులు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 45% మార్కులు ఉండాలి.

3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి రెగ్యులర్ డిగ్రీ (B.A/ B.Com/ B.Sc/ B.B.A) ఉత్తీర్ణులై ఉండాలి.

4. డేటా ఎంట్రీ ఆపరేటర్ :

ఇంటర్‌తో పాటు ‘డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్’ స్కిల్ సర్టిఫికేట్ ఉండాలి.

ముఖ్య గమనిక: అభ్యర్థులు ఖచ్చితంగా NAPS లేదా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి.

వయస్సు:

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ చట్టం ప్రకారం నెలకు నిర్ణీత స్టైపెండ్‌తో పాటు అదనంగా రూ. 2,500 ఇతర ఖర్చుల కోసం చెల్లిస్తారు. అభ్యర్థులను మెరిట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

అప్లికేషన్లకు చివరి తేదీ:

జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్ www.iocl.com లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘Apprenticeships’ విభాగంలోని ఆన్‌లైన్ ఫారమ్‌ను ఫిల్ చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here